అసిన్ పేరు చెప్పగానే గజినీ చిత్రం గుర్తుకు వస్తుంది. గజినీ మూవీతో ఆసిన్ ఇండియా మొత్తం గుర్తింపు సొంతం చేసుకుంది.

అసిన్ పేరు చెప్పగానే గజినీ చిత్రం గుర్తుకు వస్తుంది. గజినీ మూవీతో ఆసిన్ ఇండియా మొత్తం గుర్తింపు సొంతం చేసుకుంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో ఆసిన్ నటించింది. అసిన్ తెలుగులో లక్ష్మి నరసింహ, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

కెరీర్ జోరుమీద ఉన్న సమయంలో 2016లో అసిన్ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మని వివాహం చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత ఆసిన్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అసిన్, రాహుల్ శర్మ దంపతులకు ఓ కుమార్తె సంతానం. ప్రస్తుతం అసిన్ హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. 

అయితే ఊహించని విధంగా గత కొన్ని రోజుల నుంచి అసిన్ పర్సనల్ లైఫ్ విషయంలో రూమర్స్ మొదలయ్యాయి. అసిన్ తన భర్త రాహుల్ శర్మతో విడిపోతోందని.. విడాకులు తీసుకుంటున్నారని షాకింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ వార్తలకు కారణం ఒకరకంగా అసిన్ అనే చెప్పొచ్చు. 

అసిన్ సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న ఫొటోస్ డిలీట్ చేయడం వల్లే ఈ రూమర్స్ మొదలయ్యాయి. అసిన్ విడాకుల వార్తలు మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు. దీనితో తాజాగా అసిన్ డివోర్స్ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది. తాను విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం.. బేస్ లెస్ అని ఖండించింది. 

'ప్రస్తుతం నేను నా భర్త సమ్మర్ వెకేషన్ మధ్యలో ఉన్నాం. ఇద్దరం పక్కపక్కనే కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతలో పూర్తిగా ఊహాజనితమైన బేస్ లెస్ న్యూస్ వచ్చింది. ఈ వార్త విన్నాక మా పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయి. మా పెళ్ళికి ముందే మాపై రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా విడిపోవుతున్నట్లు సృష్టిస్తున్నారు. నిజంగానా ? కొత్తగా ప్రయత్నించండి. నా జీవితంలో 5 నిమిషాలు వృధా అయినట్లు అనిపించింది. లేకుంటే ఈ హాలిడేని ఇంకా బాగా ఎంజయ్ చేసేవాళ్ళం అంటూ అసిన్ తనపై వస్తున్న రూమర్స్ పై కౌంటర్ ఇచ్చింది. అయితే భర్తతో ఉన్న ఫొటోస్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో ఆమెకే తెలియాలి.