Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: అమ్మా నాతోనే ఉండిపోవా.. అశ్విని కన్నీరు మున్నీరు.. చిన్నచూపు చూసే వారికి ఎదిగి చూపించు..

బిగ్‌ బాస్‌ తెలుగు 7లో మంగళవారం ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశాడు. దీంతో శివాజీ, అశ్విని, అర్జున్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనందంతో ఉప్పొంగిపోయారు.

ashwini tearing after saw her mother in bigg boss telugu 7 house its too emotional arj
Author
First Published Nov 7, 2023, 11:05 PM IST

బిగ్‌ బాస్‌ షోలో ప్రతి ఏడాది ఫ్యామిలీ మెంబర్స్ విజిటింగ్‌ ఉంటుంది. ఈ సారి బిగ్‌ బాస్‌ తెలుగు 7 లోనూ దాని వంతు వచ్చింది. మంగళవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ విజిటింగ్‌ ఆప్షన్‌ ఇచ్చారు. అందులో భాగంగా మొదట శివాజీ కొడుకు వచ్చాడు. డాక్టర్‌గా వచ్చి శివాజీని చెక్‌ చేశాడు. ఆయన భుజం పెయిన్‌ని చెక్‌ చేసి, తగ్గిపోయిందని చెప్పారు. కానీ తన కొడుకుని శివాజీ గుర్తించలేకపోయాడు. మాస్క్, గ్లాసెస్‌ ధరించడంతో గమనించలేకపోయాడు. ఇక చెకప్‌ అయిపోయాక వెళ్లిపోతుండగా నాన్న అంటూ మాస్క్, గ్లాసెస్‌ తీశాడు. దీంతో శివాజీ ఆనందానికి అవదుల్లేవ్‌. 

హౌజ్‌లోకి తీసుకొచ్చి అందరికి పరిచయం చేశాడు. ఎలా ఆడాలో తన కొడుకు చెప్పడం శివాజీ నాకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు అని వెల్లడించాడు. అయితే అందరిని నమ్మొద్దంటూ తెలిపాడు. ఆటలో నిన్నురెచ్చగొడుతున్నారని, కానీ రెచ్చిపోవద్దని, కూల్‌గా ఉండమని చెప్పాడు. అయితే శివాజీకి ఏదో సైగలు చేసి వెళ్లాడు ఆయన తనయుడు. వేలితో గోకడం హైలైట్‌గా చూపించాడు బిగ్‌ బాస్‌. తన ఆట తీరు ఎలా ఉంది? ఏ పొజిషన్‌లో ఉన్నావనేది చెప్పినట్టుగా ఉంది. 

అనంతరం అర్జున్‌ వైఫ్‌ సురేఖ వచ్చింది. ఆమె గర్భవతిగా ఉంది. ఆమె తన ప్రేమని పంచింది. అందరి ముందు ముద్దులతో ముంచెత్తింది. తనలోని ఎమోషన్‌ని బయటపెట్టడం లేదని, గట్టిగా వాదించడం లేదని, సైలెంట్‌గా ఉంటున్నావని, గట్టిగా మాట్లాడు అని తెలిపింది. గోరు ముద్దలు తినిపించింది. మరోవైపు లోపల బేబీ సందడి చేస్తుందని, రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తుందని ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. దీంతో అర్జున్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మరోవైపు హౌజ్‌లో అందరు కలిసి బిగ్‌ బాస్‌ సమక్షంలో అర్జున్‌ వైఫ్‌కి సీమంతం చేయించారు. దీంతో అటు అర్జున్‌, ఇటు ఆయన భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఇక చివరగా అశ్విని అమ్మ వచ్చింది. వీరి గేమ్‌ నవ్వులు పూయించేలా సాగింది. బిగ్‌ బాస్‌ ఫ్రీజ్‌, రొటేట్‌ యాక్టివిటీస్‌ చేయిస్తూ ఈ గేమ్‌ నిర్వహించారు. అమ్మ రాగానే అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. తనని చిన్న చూపు చూస్తున్నారని, చులకన చేస్తున్నారని ఆమె అమ్మతో చెబుతూ వాపోయింది. తనకు హౌజ్‌ నుంచి బయటకు రావాలనిపించిందని తెలిపింది. దీంతో కూతురిని ఓదార్చింది అమ్మ. స్ట్రాంగ్‌గా ఉండాలని, ఊరికే ఏడవొద్దని చెప్పింది. చిన్న చూపు చూసిన వారికి నువ్వేంటో చూపించాలని, బాగా గేమ్‌ ఆడి నువ్వు స్ట్రాంగ్‌ అని ఎదిగి చూపించాలని తెలిపింది. 

కానీ అశ్విని చాలా రోజులు ఇన్‌సెక్యూరిటీ మధ్య బతికింది. ఫిజికల్‌గా ఆమె స్ట్రాంగ్‌గా ఉన్నా, మెంటల్‌గా మాత్రం వీక్‌గానే ఉంది. ఆ విషయం ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. అందుకే స్ట్రాంగ్‌గా ఉండమని, గట్టిగా వాదించమని, లిమిట్స్‌ దాటితో ఊరుకునేది లేదని వాళ్లమ్మ చెప్పింది. అలానే ఆడి తానేంటో చూపిస్తానని అశ్విని వెల్లడించింది. అయితే అమ్మ వదిలి వెళ్లే క్రమంలో బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్ చేసుకుంది. ఈ రోజుకి అమ్మని హౌజ్‌లోనే ఉంచమని వాపోయింది. అమ్మా ఇందులోనే ఉండిపోవా అంటూ వేడుకుంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంది. ఇలా ఫ్యామిలీ ఎపిసోడ్‌ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. రేపు గౌతమ్‌ అమ్మ వస్తుండటం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios