యువ నటుడు ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అశ్వమేథం. జి.నితిన్ ఈ చిత్రానికి దర్శకుడు.  ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

సోన్యా, శివంగి ఖేడ్కర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ కమెడియన్లు వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ చిత్రంలో కామెడీ పండించనున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రియా నైర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాతలు అశ్వమేథం రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగష్టు 9న గ్రాండ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆగష్టు 9న నాగార్జున మన్మథుడు 2 రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన్మథుడు 2 పోటీని ఈ చిన్న చిత్రం ఎలా తట్టుకుని నిలబడుతుందో వేచి చూడాలి.