Asianet News TeluguAsianet News Telugu

మనిషి మనసుతో చేసే యుద్ధం మహాసంగ్రామం.. ఆషు రెడ్డి `ఏ మాస్టర్‌ పీస్‌` టీజర్‌ అదిరింది..

సోషియో ఫాంటసీ నేపథ్యంలో సినిమాలు ఇటీవల తెలుగులో తగ్గాయి. `కల్కి2898ఏడీ` రాబోతుంది. దీంతోపాటు మరో చిన్న మూవీ `ఏ మాస్టర్‌ పీస్‌` కూడా అలాంటి కథతోనే వస్తుంది. 
 

ashu reddy starrer a master piece teaser out something interesting arj
Author
First Published Jun 7, 2024, 11:35 PM IST

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, బోల్డ్ బ్యూటీ ఆషు రెడ్డి నటిగా నెమ్మదిగా పుంజుకుంటుంది. పెద్ద పెద్ద సినిమాల్లో భాగమవుతుంది. తాజాగా ఆమె `ఏ మాస్టర్‌ పీస్‌` అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. అరవింద్‌ కృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. సుకు పూర్వజ్‌, మనీష్‌ గిలాడ, జ్యోతి పూర్వాజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. సోషియో ఫాంటసీ, మైథలాజికల్‌ అంశాలకు సైన్స్ ని ముడిపెడుతూ ఈ సినిమాని రూపొందించినట్టు టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. 

`హరణ్య కశ్యపుడు అనే ఒక భయంకరమైన రాక్షస మహారాజు గురించి విన్నారా?`, `ప్రపంచంలో ఎన్నో రకాలైన యుద్ధాలుంటాయి. కానీ మనిషి మనసుతో చేసే యుద్ధం మాత్రం మహా సంగ్రామం`, `శివుడు నిన్ను రక్షించాలనుకుంటే ఈ సృష్టిలో ఎవరూ నిన్ను శిక్షించలేరు`, అదే శివుడు శిక్షించాలనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవరూ రక్షించలేరు`, `ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు కదా వాడు వస్తే డీల్‌ చేసే దమ్ము మీకు ఉందా`, నాకు ఎదురు చెప్పేవాడు, ఎదురించే వాడు ఒక్కడొచ్చాడు. మంత్రివర్య అది కర్మ, సత్కర్మ, శ్రీరాముడు శ్రీవిష్ణు అవతారం` అని చెప్పే డైలాగ్‌లు ఈ క్రమంలో కొన్నిశక్తులు ప్రధాన పాత్రలను వెంటాడటం. చివరగా అతీత సూపర్‌ పవర్స్ తో హీరో ఎంట్రీ ఇవ్వడం, విలన్‌తో తలపడటం, దీనికి శివుడు, విష్ణువు వంటి కాన్సెప్ట్ కి ముడిపెట్టడం కొత్తగా ఉంది. టీజర్ ఆకట్టుకుంది. విజువల్‌గానూ అదిరిపోయింది. 

టీజర్‌ ఈవెంట్‌లో దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ , మనం వరల్డ్ సినిమాలోని ఎన్నో సూపర్ హీరోల సినిమాలను చూశాం. నాకూ చాలా సూపర్ హీరోల సినిమాలు ఇష్టం. ఆ సూపర్ హీరో క్యారెక్టర్ కు మన పురణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయొచ్చనే ఐడియాతో `ఏ మాస్టర్ పీస్` సినిమాను ప్రారంభించాను. ఇందులో మన మైథాలజీ సోల్ ఉంటుంది. భాగవతంలోని జయ విజయుల నేపథ్యంతో హీరో, విలన్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాం. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నా. అందుకే మా పోస్టర్ లో మిథ్స్ రీఇమాజిన్ డ్ అని రాశాం. చిన్న ప్రాజెక్ట్ గా "ఏ మాస్టర్ పీస్" మూవీ మొదలైంది.

సినిమా షూటింగ్ ప్రాసెల్ బిగ్ స్కేల్ కు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు మనీష్ గిలాడ, సినిమా బండి ప్రొడక్షన్స్ శ్రీకాంత్  నిర్మాణంలో యాడ్ అయ్యారు. హాలీవుడ్ మూవీస్ కు పోస్ట్ ప్రొడక్షన్ చేసే మెర్జ్ ఎక్స్ ఆర్ మా టీమ్ లో జాయిన్ అయ్యింది. వాళ్లు చేసిన వీఎఫ్ఎక్స్ మీకు అద్భుతమైన ఫీల్ కలిగిస్తాయి. ఈ జర్నీలో హీరో అరవింద్ కృష్ణ, నిర్మాత మనీష్ గిలాడ, ప్రొడ్యూసర్ శ్రీకాంత్, మెర్జ్ ఎక్స్ ఆర్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మనీష్ గిలాడ లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్ లో వచ్చేది కాదు. అరవింద్ కృష్ణ నాకు బ్రదర్ లాంటివాడు. సూపర్ హీరో సినిమా మరో పెద్ద హీరోను ట్రై చేయొచ్చు కదా అని కొందరు అన్నారు. అరవింద్ లాంటి పర్సనాలిటీ ఉన్న హీరోనే సూపర్ హీరోగా ఇమాజిన్ చేసుకున్నాను. నా వైఫ్ జ్యోతి పూర్వజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. పది రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేయబోతున్నాం. మేకింగ్ లో నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ఇది ఫస్ట్ పార్ట్ మూవీ. రిలీజ్ అప్డేట్ ను త్వరలో వెల్లడిస్తాం` అని తెలిపారు.  

హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, `ఏ మాస్టర్ పీస్` సినిమా ఆఫర్ నాకు సుకు ఇచ్చే ముందే నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకుకు నేను సూపర్ హీరోలా ఉండాలని అనుకున్నా. అదే టైమ్ లో సుకు ఈ మూవీ ఆఫర్ అందించాడు. మనీష్ నేను కాలేజ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రిన్సిపాల్ రూమ్ లో చూసిన తర్వాత ఇదే వేదిక మీద మా పేరెంట్స్ మమ్మల్ని చూడటం. మేము ప్రయోజకులం అయ్యామని చెప్పేందుకే మా పేరెంట్స్ ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం. `ఏ మాస్టర్ పీస్` సినిమా మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది` అని అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios