విశ్వక్ సేన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు ఆహా కొనుగొలు చేసిందట. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిజానికి వివాదానికి ముందు కూడా ఈ సినిమా కాన్సెప్ట్ అట్రాక్టివ్‌గానే ఉండేది. అదే లేటు వయసులో వివాహం. పెద్ద వివాదం తర్వాత రిలీజ్ అయిన సినిమా కావడంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. సర్కారు వారి పాటతో థియోటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. ఆహాపురంలో అర్జున్ కళ్యాణం జూన్ 3 నుంచి అని ప్రకటించారు.
విశ్వక్ సేన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు ఆహా కొనుగొలు చేసిందట. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్‌గా నటించింది.
గ్రామీణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెళ్లి అనే కాన్సెప్ట్ చూట్టూ తిరుగుతుంది. కథలోకి వెళ్తే... అల్లం అర్జున్ కుమార్ అలియాస్ అర్జున్ (విశ్వక్‌సేన్) సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ల వర్గంలో అమ్మాయిలు తక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతుంది. దీంతో 33 ఏళ్లు వచ్చినా పెళ్లి అవ్వదు. ఆఖరికి గోదావరి జిల్లాలో ఓ సంబంధం సెట్ అవుతుంది. ఆమే మాధవి (రుక్సార్). అక్కడ నిశ్చితార్థం అయ్యాక అర్జున్‌కి షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి, ఆ తర్వాత ఏం జరిగింది. అర్జున్ - మాధవిల కథలో వసుధ (రితికా నాయక్) ఎందుకొచ్చింది అనేదే కథ.
ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్ షో నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది ఫన్నీగా ఉంది అంటుండగా మరికొందరు సినిమాను చాలా లాగ్ చేశారన్నారు. ఇలా డివైడ్ టాక్ తెచ్చుకుంటూ యవరేజ్‌గా నిలిచినా కలెక్షన్స్ పరంగా బాగుందనిపించింది.
