కరోనా మహమ్మారి ఇంకా వదలట్లేదు. దాని బారిన ఇంకా పడుతున్నారు. ఇటీవల రణ్‌బీర్‌ కపూర్‌ కరోనాకి గురయ్యారు. తాజాగా పవన్‌, మహేష్‌ల విలన్‌, విలక్షణ నటుడు ఆశిష్‌ విద్యార్థి కూడా కరోనాకి గురయ్యాడు. ఈ విషయాన్ని ఆయన తాజాగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 

కరోనా మహమ్మారి ఇంకా వదలట్లేదు. దాని బారిన ఇంకా పడుతున్నారు. ఇటీవల రణ్‌బీర్‌ కపూర్‌ కరోనాకి గురయ్యారు. తాజాగా పవన్‌, మహేష్‌ల విలన్‌, విలక్షణ నటుడు ఆశిష్‌ విద్యార్థి కూడా కరోనాకి గురయ్యాడు. ఈ విషయాన్ని ఆయన తాజాగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. `కాస్త జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ ఒక్క విషయంలోనే నేను పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో జాయిన్‌ అవుతున్నా. కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నవారు దయజేసి కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకోవాలనికోరుతున్నా` అని తెలిపారు. 

Scroll to load tweet…

తాను ఆసుపత్రిలో చేరి మూడు రోజులవుతుంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనిచెప్పారు. తాను మ్యాక్స్ హెల్త్ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. తనకిసంబంధించి రోజు వారి హెల్త్ అప్‌డేట్‌ని ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఆశిష్‌ విద్యార్థి విలన్‌గా, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి భాషల్లో వందల చిత్రాల్లో నటించారు. తెలుగులో `చిరుత`, `గుడుంబా శంకర్‌`, `పోకిరి`, `అతిధి`, `అదుర్స్`, `పంతం`, `జనతా గ్యారేజ్‌`, `ఇస్మార్ట్ శంకర్‌` వంటి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రధానంగా విలన్‌ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.