ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఆరోగ్యం మరోసారి విషయించింది. గత నెల మొదటి వారం నుంచి ఆస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.

ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఆరోగ్యం మరోసారి విషయించింది. గత నెల మొదటి వారం నుంచి ఆస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.

లెజండరీ సింగర్ లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆందోళణ మొదలయ్యింది. కరోనాతోగత నెల 8న ముంబయ్ లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతా(Lata Mangeshkar)జీ.. అప్పటి నుంచీ ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈమధ్య ఆమో ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆమె కోలుకున్నట్టు అని సంబరపడ్డారు అభిమానులు.

కరోనాతో పాటు న్యూమోనియాతో బాధపడ్డ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కు ఈ మధ్యే కరోనా తగ్గిపోయింది. కోలుకున్నారు అనకున్న సమయంలోనే.. మరోసారి ఆమె ఆరోగ్యం మరోసారి విషమంగా మారింది. ఈ విషయాన్ని డాక్టర్ ప్రతీత్ సంధాని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న లతా మంగేష్కర్ చెల్లెలు ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే (Asha Bhosle).. హుటా హుటిన బ్రీచ్ కాండీ హాస్పిటల్ కు చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడిన ఆమె.. లతాజీ ఆరోగ్యం పై మీడియాకు అప్ డేట్ ఇచ్చారు.

ఆశా (Asha Bhosle) మాట్లాడుతూ.. లతా దీదీ ఆరోగ్యం మరోసారి విషమించింది. ప్రస్తుతానికి డాక్టర్ల ప్రయత్నం వల్ల నిలకడగా మారింది. మాతో పాటు అభిమానులందరూ లతాజీ (Lata Mangeshkar) ఆరోగ్యం గురించి ప్రార్ధనలు చేయండంటూ..వేడుకున్నారు. ప్రస్తుతానికి భయపడవలసింది ఏమీ లేదన్నారు. లతాజీ కోలుకుంటున్నారు. తప్పకుండా మనకోసం ఆరోగ్యంగా తిరిగి వస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఆశా భోస్లే(Asha Bhosle).