ఆ హీరో ముద్దు పెట్టాకే నేను పెట్టా!

arya romantic kiss to abernathy
Highlights

తమిళ హీరో ఆర్య తెలుగు వారికి కూడా పరిచయమే.. అతడు నటించిన సినిమాలను తెలుగులో

తమిళ హీరో ఆర్య తెలుగు వారికి కూడా పరిచయమే.. అతడు నటించిన సినిమాలను తెలుగులో అనువదిస్తుంటారు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క 'ఇంగ వీటు ముప్పిల్లై' అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆర్యతో పాటు నటి సంగీత కూడా ఈ షోను హోస్ట్ చేశారు. కొందరు అమ్మాయిలు ఈ షోలో పాల్గొని తమకు ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేశారు. తాజాగా ఈ షో సీజన్ ముగిసింది. విజేతగా నిలిచిన అమ్మాయిని ఆర్య పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం జరిగింది కానీ అందులో నిజం లేదు. 

అయితే ఈ షోలో ఆర్య.. అబర్నతి అనే అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారు. ఆ విషయం వైరల్ అయింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చిన అబర్నతి.. ''అదొక విభిన్నమైన అనుభూతి. షోలో మిగిలిన వారెవరికి దక్కని అవకాసం నాకు వచ్చింది. ఆర్య నన్ను స్పెషల్ గా చూడడం నాకు నచ్చింది. నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆయన నన్ను ముద్దుపెట్టుకున్నారు. ఆ తరువాతే నేను పెట్టాను'' అంటూ ముద్దుకథను చెప్పుకొచ్చింది ఈ భామ. 
 

loader