కొన్ని కాంబినేషన్స్ సూపర్ హిట్టవుతాయి. అవి రిపీట్ అవుతాయి. ఫ్లాఫ్ కాంబినేషన్స్ జోలికి ఎవరూ పోరు. కానీ సుకుమార్ ఆ సెంటిమెంట్ ఏదీ పట్టించుకున్నట్లు లేరు. పదేళ్ల క్రితం అల్లు అర్జున్, ఆర్య కాంబినేషన్ లో వరుడు చిత్రం వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ సెట్ చేయటానికి రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. తమిళ మార్కెట్ కోసమే తమిళ స్టార్ ని తీసుకుని రావాలనేదే టీమ్ తిప్పలు. అందుకోసం మొదట విజయ్ సేతుపతి ని ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అనుకున్నారు. 

కానీ మొదట ఓకే చెప్పిన సేతుపతి తర్వాత తెలుగు వరకు ఓకే గానీ, తమిళ్‌ అంటే నా ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని అని తప్పుకున్నాడు. అప్పటినుంచి 'పుష్ప'కి విలన్‌ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. విజయ్ సేతుపతి తప్పుకున్నాక చాలా ఆ పాత్ర కోసం వినిపించాయి. మాధవన్, బాబీ సింహా లాంటి వాళ్లని పరిశీలిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ వీళ్లల్లో ఒక్కళ్లు కూడా ఫైనల్‌ కాలేదు. ఇక అప్పటి నుంచి మొదలైన విలన్‌ వేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆర్యని ట్రై చేస్తున్నారనే టాక్ తమిళ సినీ వర్గాల్లో మొదలైంది.

అప్పట్లో 'వరుడు' సినిమాలో ఆర్య విలన్‌గా నటించాడు. తర్వాత 'రాజారాణి' లాంటి డబ్బింగ్‌ మూవీస్‌తో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగు, తమిళ్లో మార్కెట్‌ ఉన్న ఆర్య 'పుష్ప'కి ప్లస్ అవుతాడు భావిస్తున్నారట మేకర్స్. కన్నడ స్టార్ ధనుంజయ్,కమిడియన్ సునీల్ సైతం ఈ సినిమాలో నెగిటివ్ రోల్స్ లో కనిపించనున్నారు. అయితే ఆర్య మాత్రం మెయిన్ విలన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. లంచాలు తీసుకున్న కరప్ట్ పోలీస్ అధికారిగా ఆర్య కనిపించబోతున్నట్లు సమాచారం. 

షూటింగ్ వివరాల్లోకి వెళితే...ఈ సినిమా మొడటి షెడ్యూల్ షూటింగ్‌ను రాజమండ్రి పరిసరాల్లోని మారెడుమిల్లి అడవుల్లో షూట్ చేసారు. దాని తరువాత వారణాసికి ప్రయాణం మొదలు పెట్టారు. అదే సమయంలో చిత్ర టీమ్ లో కరోనా కలకలం రేపడంతో షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. దాని తరువాత సుకుమార్ తన రంగస్థలం ఫార్ములానే పుష్పకు ఫిక్స్ చేసి హైదరాబాద్ పఠాన్ చెరువు ప్రాంతంలో ప్రత్యేకమైన అడవి సెట్ వేసి షూట్ చేశాడు. అయితే ఇప్పుడు పుష్పరాజ్ మరోసారి మారెడుమిల్లీ అడవులకి వెళుతున్నాడట.  జనవరిలో అక్కడ షూట్ మొదలపెట్టనున్నట్లు సమాచారం.