కోలివుడ్ అగ్ర హీరో ఆర్యతో హీరోయిన్ సాయేషా సైగల్ ప్రేమాయణం సాగిస్తుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం 'అఖిల్' తో హీరోయిన్ గా పరిచయమైంది సాయేషా సైగల్.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అమ్మడుకి తెలుగులో అవకాశాలు రాలేదు.

దీంతో కోలివుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. గతేడాది ఆమె హీరో ఆర్యతో కలిసి 'గజినికాంత్' అనే సినిమాలో నటించింది. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకూ వెళ్తుందని కోలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట ఈ జంట. ఇరు వర్గాల కుటుంబ సభ్యులకు కూడా వీరి పెళ్లిపై ఎలాంటి అభ్యంతరం లేదని టాక్. ప్రస్తుతం ఆర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్' అనేసినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల సాయేషా తల్లి 'కాప్పాన్' సెట్స్ కి వెళ్లి ఆర్యని కలిసినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా.. వీరిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆర్య వయసు 38 కాగా, సాయేషా వయసు 21 మాత్రమే.. దాదాపు ఇద్దరి మధ్య 17 ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ఏజ్ పెద్ద మేటర్ కాదని తమ కంటే వయసులో పెద్ద వాళ్లను చేసుకొని నిరూపిస్తున్నారు. మరి ఈ జంట వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి!