Asianet News TeluguAsianet News Telugu

పారితోషికం ఇవ్వలేదంటూ కోర్టుకెక్కిన నటుడు!

సీనియర్ నటుడు అరవింద్ స్వామీ రీఎంట్రీలో తన సత్తా చాటుతున్నాడు. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓ నిర్మాత తనకు పారితోషికం ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేస్తున్నాడంటూ కోర్టుకెక్కాడు అరవింద్ స్వామీ

Arvind Swamy sues Manobala over non-payment of dues
Author
Hyderabad, First Published Sep 13, 2018, 4:18 PM IST

సీనియర్ నటుడు అరవింద్ స్వామీ రీఎంట్రీలో తన సత్తా చాటుతున్నాడు. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓ నిర్మాత తనకు పారితోషికం ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేస్తున్నాడంటూ కోర్టుకెక్కాడు అరవింద్ స్వామీ. వివరాల్లోకి వెళితే.. చతురంగవేట్టై సినిమాను నిర్మించిన మనోబాలా ఆ సినిమా సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా చతురంగ వేట్టై2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో నటించినందుకు అరవింద్ స్వామికి పూర్తి పారితోషికం చెల్లించకపోవడంతో ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నిర్మాత మనోబాలా తనకు 1.79 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

తనకు రావాల్సిన డబ్బు చెల్లించకుండా సినిమా రిలీజ్ చేస్తునానరని, తన పారితోషికం ఇచ్చినంత వరకు సినిమా విడుదలపై నిషేధం కోరారు. ఈ కేసు బుధవారం విచారణకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios