పుష్ప మూవీ చూద్దాం అంటే టికెట్స్ దొంరకడం లేదంటున్నారు స్టార్ డైరెక్టర్ మారుతి. ఎవరైనా టికెట్లు ఇప్పించడని సోషల్ మీడియాలో అడుగుతున్నాడు. ఈ పోస్ట్ కు వెంటనే రిప్లై ఇచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పుష్ప వైబ్స్ నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(17 డిసెంబర్ ) రిలీజ్ అయిన సినిమా దడదడలాడిస్తుంది. ఈ సినిమా కోసం అటు సామాన్యులు దగ్గర నుంచి ఇటు సెలబ్రెటీల వరకూ అందరూ ఆరాటపడుతున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతి పుష్ప సినిమా గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఎర్లీ షో కోసం పుష్ఫ టికెట్స్ కావాలని ట్విట్లర్ లో పోస్ట్ చేశారు డైరెక్టర్ మారుతి.
అంతే కాదు అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీస్ పేజ్ లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. విచిత్రం ఏంటీ అంటే... ఈ పోస్ట్ కు హీరోయిన్ రాశీ ఖన్నా స్పందించారు. టికెట్స్ దొరకడం చాలా కష్టం సార్ ... నేను కూడా ట్రై చేస్తున్నాను.. దొరకడం లేదు అంటూ..నవ్వుతున్న ఎమోజీని ట్యాక్ చేసి, మారుతి ట్వీట్ కు రిప్లై ఇచ్చింది రాశీ ఖన్నా. వీరిద్దరి సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ కు చాలా దగ్గర ఆత్మీయుడు మారుతి. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉంది. వీరి కాంబిసేషన్ లో గీతాఆర్ట్స్ బ్యానర్ లో.. సినిమా కూడా చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే బన్నీకి ఇంత ఆత్మీయుడు.. స్టార్ డైరెక్టర్ మారుతీకే టికెట్స్ దొరక్కపోవడం ఏంటీ అంటూ.. కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read : BALAYYA MOVIE TITLE : వేటాడబోతున్న బాలయ్య.. నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్..
ఇక ప్రస్తుతం మారుతి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ తో కలిసి యూవీ క్రియేషన్స్ ఈమూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్.. ప్రమోషనల్ వీడియోస్ , పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.
