మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అర్జున్ జైట్లీ ఢిల్లీలో శనివారం రోజు మృతి చెందారు. అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అర్జున్ జైట్లీ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులంతా అరుణ్ జైట్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 

'అర్జున్ జైట్లీ మరణ వార్త వినగానే చాలా బాధ కలిగింది. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని హీరో రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశాడు. 

'ఆయన మరణ వార్త వినగానే న హృదయం బరువెక్కింది. అరుణ్ జైట్లీ గారిని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ ఆయన దేశానికి చేసిన సేవ అద్భుతమైనది. భావితరాలకు ఆయన జీవితం మార్గదర్శకం' అని హీరోయిన్ నిమ్రత్ కౌర్ సోషల్ మీడియాలో తెలిపింది. 

సీనియర్ సింగర్ ఆశా బోస్లే ట్వీట్ చేస్తూ' అరుణ్ జైట్లీ గారి గురించి ఇలాంటి చేదు వార్త వింటానని అనుకోలేదు. అయన కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా' అని అన్నారు. 

సీనియర్ నటుడు అనిల్ కపూర్ ట్వీట్ చేస్తూ' అర్జున్ జైట్లీ గారిని నేను 20 ఏళ్ల క్రితమే కలిశా. నేను ఆయన అభిమానిని. అరుణ్ జైట్లీ మరణం దేశానికీ తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నా' అని అన్నారు. 

'అరుణ్ జైట్లీ మృతికి నా సంతాపం. నమ్మకం కలిగించే గొప్ప నాయకుడిని దేశం కోల్పోయింది' అని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. 

'అరుణ్ జైట్లీ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. యానం డైనమిక్ లీడర్. నన్ను కలవడానికి తరచుగా మా ఇంటికి వచ్చేవారు. మేం చాలా సమయం మాట్లాడుకునేవాళ్ళం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. 

'అరుణ్ జైట్లీ గారి మరణం నన్ను షాక్ కి గురిచేసింది. చాలా భాదపడ్డా. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్నివ్వాలి. దేశానికి ఆయన చేసిన సేవ మరువలేనిది. మంచివాళ్ళు త్వరగానే వెళతారు' అని నటి రవీనా టాండన్ ట్వీట్ చేశారు. 

'అరుణ్ జైట్లీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు దేశానికి చేసిన సేవకు కృతజ్ఞతలు' అని యువ హీరో వరుణ్ ధావన్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.