ఆ హీరోని తలచుకొని కంటతడి పెట్టుకుంది!

artist sudha about uday kiran
Highlights

వైవిధ్యమైన పాత్రలు పోషించగల నటిగా సుధ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది

వైవిధ్యమైన పాత్రలు పోషించగల నటిగా సుధ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. 40 ఏళ్లుగా సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు. అమ్మగా, అత్తగా, పిన్నిగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె నటించిన 'అమ్మమ్మగారిల్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అయింది. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సుధ కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా నటుడు ఉదయ్ కిరణ్ తలచుకొని కంటతడి పెట్టారు.

''ఉదయ్ కిరణ్ నన్ను అమ్మా అని పిలిచేవాడు. మీతోనే అన్ని షేర్ చేసుకోగలను అంటూ ప్రతి విషయాన్ని చెప్పేవాడు. నేను అతడిని దత్తత తీసుకోవాలనుకున్నాను. తీసుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని'' ఉద్వేగానికి లోనయ్యారు 

loader