Asianet News TeluguAsianet News Telugu

రజనీకి స్కూటర్ పై లిప్ట్ ఇచ్చేవాడట..ఇప్పుడు గుర్తొచ్చి

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతకాలం కొందరిని కరుణిస్తే..మరికొంతకాలం మరికొందరిని అందలం ఎక్కిస్తుంది. లేకపోతే ...ఒకప్పుడు రజనీకాంత్ కు లిప్ట్ ఇచ్చిన నటుడు సాదాసీదాగా మిగిలిపోవటం ఏమిటి.. 

Artist Hemasundar talks about Rajanikanth
Author
Hyderabad, First Published Nov 17, 2018, 10:04 AM IST

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతకాలం కొందరిని కరుణిస్తే..మరికొంతకాలం మరికొందరిని అందలం ఎక్కిస్తుంది. లేకపోతే ...ఒకప్పుడు రజనీకాంత్ కు లిప్ట్ ఇచ్చిన నటుడు సాదాసీదాగా మిగిలిపోవటం ఏమిటి...రజనీ ..అందనంత ఎత్తుకు ఎదిగిపోవటం ఏమిటి..ఇది కాస్తంత వేదాంతం గా అనిపించినా నిజం. ఇంతకీ రజనీకి లిప్ట్ ఇచ్చింది ఎవరూ అంటారా..

ఈయన్ని మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు.   తెలుగు తెరపై తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నటుడు హేమసుందర్.  ఆయనకి రజనీ బాగా పరిచయం. రజనీ కెరీర్ ప్రారంభం రోజుల్లో రజనీ..ఈయన్ని కలుస్తూండేవారు. ఆ విషయాలు గుర్తు చేసుకున్నారు హేమసుందర్. దాంతో హేమసుందర్  రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రజనీతో తనకి గల బంధాన్ని గురించి ప్రస్తావించారు.

హేమసుందర్ మాట్లాడుతూ... రజనీకాంత్ హీరోగా ఎదగడానికి ముందు నుంచే నాకు తెలుసు. ఆయనతో నాకు చాలా సాన్నిహిత్యం వుంది. అప్పట్లో నాకు స్కూటర్ ఉండేది .. ఆ స్కూటర్ పై నేను వెళుతుంటే నన్ను లిఫ్ట్ అడిగేవాడు. 'నీకు ట్రబుల్ ఇస్తున్నాను' అనేవాడు. 'నేనేమైనా భుజాల మీద మోసుకెళుతున్నానా .. కూర్చో'  అనేవాడిని. అలా నన్ను లిఫ్ట్ అడిగిన రజనీకాంత్ రాకెట్ వేగంతో దూసుకుపోయాడు. 

ఇక ఇప్పుడు తనకి ఎంత ఆస్తి ఉందనే విషయం తనకే తెలియనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆయన కుబేరుడిగా మారిపోయినా .. గర్వాన్ని మాత్రం దగ్గరికి రానీయలేదు. లైట్ బాయ్ భుజాన చేయివేసి 'ఎలా వున్నావురా' అని ఆప్యాయంగా అడగడం ఆయనకే చెల్లింది. రజనీకి జీవితంలో నటించడం తెలియదు. అందుకే ఇంతమంది మనసులో ఆయనకి ఇంతటి స్థానం లభించింది" అని చెప్పుకొచ్చారు.  నిజమే కదా. ఎవరూ ఉత్తినే ఎదగరు కదా. 

Follow Us:
Download App:
  • android
  • ios