హీరోగా మరో టాలీవుడ్ కమెడియన్ తనయుడు కృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీనియర్ యాక్టర్ గా ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించిన గౌతమ్ రాజు ఇప్పుడు తన కుమారుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు. బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం  'కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్'.  

శ్రీ‌నాధ్ పుల‌క‌రం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల‌చేసిన టీజ‌ర్ కి  మంచి రెస్పాన్స్ రావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల్లో సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. అక్టోబర్ 18 న సినిమాను గ్రాండ్ గా విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌కుర‌మ్ మాట్లాడుతూ - "కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్  అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. 

సూపర్ మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది.  హీరో కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కంటెంట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్