జమ్మూకాశ్మీర్ పై పాకిస్థాన్ సినీ నటి మహీరాఖాన్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి పూర్తిగా రద్దు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ ని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ పార్లమెంటులు బిల్లుకి ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పాక్ సినీనటి మహీరాఖాన్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''మేము పరిష్కరించడానికిఇష్టపడని వాటిని సౌకర్యవంతంగా నిరోధించారా? ఇది ఇసుక మీద గీసిన గీతలకు మించినది, ఇది అమాయక ప్రాణాలను కోల్పోవడంగురించి స్వర్గం మండుతోంది ...మేం నిశ్శబ్దంగా రోదిస్తున్నాం'' అంటూ రాసుకొచ్చింది.

మహీరా ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు  పరోక్షంగా ఆమెపై విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు నేరుగానే తిట్టిపోస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ బలూచిస్థాన్, సింధ్ ఎంత అభివృద్ధి చెందాయి? దీనికోసం మీ గుండె ఎందుకు కాలిపోవడం లేదని ఓ నెటిజన్ ప్రశ్నించారు.  

''కాశ్మీర్ మాది, మా ప్రభుత్వం శాంతిని కాపాడేందుకు ఈ చర్య తీసుకుంది..మా కశ్మీర్ విషయంలో మేం ఏమైనా చేస్తాం, కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది'' అంటూ మరో నెటిజన్ మహీరా మాటలకు ఘాటుగా బదులిచ్చాడు.