స్టార్ హీరోని చంపాలనుకున్నాడు!

Arrested Gangster Was Planning To Kill Salman Khan
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందా..? అంటే అవుననే సమాధానాలు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ను చంపడానికి ప్లాన్ చేసినట్లు గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా పోలీసుల ముందు అంగీకరించడంతో అంతా అవాక్కయ్యారు.

హర్యానా, రాజస్థాన్, పంజాబ్ వంటి ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన సంపత్ నెహ్రా పోలీసుల విచారణలో తను సల్మాన్ ను చంపడానికి రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు. అసలు విషయంలోకి వస్తే.. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్.. బిష్నోయి వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించాడు. ఈ వర్గపు ప్రజలకు ప్రకృతి అంటే ప్రాణం.. ప్రాణం పోయినా చెట్టుని కొట్టరు, జంతువులను వేటాడరు.

దీంతో తమఆగ్రహానికి కారమైన సల్మాన్ పై గతంలో విరుచుకుపడ్డారు. అదే వర్గానికి చెందిన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా కోపంతో సల్మాన్ ను చంపడానికి కుట్ర పన్నాడు. కోర్టుకి వచ్చిన సల్మాన్ ను చంపడానికి రెక్కీ కూడా నిర్వహించాడు. గతంలో సోషల్ మీడియాలో కూడా సంపత్.. సల్మాన్ ను చంపుతానని బెదిరించాడు. సల్మాన్ ఇంటిని, అతడు వెళ్లే మార్గాలను గమనించి పక్కా ప్లాన్ తో సల్మాన్ ను చంపేసి దేశం విడిచి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేశాడు. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు నివ్వెరపోయారు. ప్రస్తుతం సంపత్ హర్యానా పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సల్మాన్ పై త్రెట్ ఉందన్న విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అతడి సెక్యురిటీ మరింత పటిష్టం చేశారు.

loader