పవన్ కళ్యాణ్ హీరోయిన్.. బాలీవుడ్ బ్యూటీ.. అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. రాంచీకి చెందిన ఓ వ్యక్తి తనను మోసం చేసిందంటూ.. అమీషాపై కోర్ట్ లో కేసు వేశాడు. దాంతో ఆమెపై వారెంట్ జారీ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ బద్రితో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.. సొట్ట బుగ్గల చిన్నది అమీషా పటేల్. తెలుగులో చేసింది నాలుగు సినిమాలే అయినా.. మంచి ఇమేజ్ తో పాటు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సాధించింది బ్యూటీ. చిన్నగా బాలీవుడ్ కే పరిమితం అయిన బ్యూటీ.. ఇప్పుడు అక్కడే అడపా దడపాసినిమాలు చేసుకుంటూ గడిపేస్తోంది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు అమిషా పటెల్. ఆమెను సౌత్ ఆడియన్స్ అంత త్వరగా మర్చిపోలేరు. బద్రి సినిమా తరువాత టాలీవుడ్ లో మహేష్ బాబు తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమాల్లో నటించింది బ్యూటీ... అయితే అందులో కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి. .
ఇక నార్త్ లో ఐపిఎల్ ఊపులో ఉన్న అమీషా పటేల్ పై కేసు నమోదు అయ్యింది. అంతే కాదు అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఇంతకీ అంత నేర పవర్ స్టరా్ హీరోయిన్ ఏం చేసింది అంటే.. ఓ చెక్ బౌన్స్ కేసు విషయంలో అమీషాపై కేసు నమోదు అయ్యింది. తనను మోసం చేసిందని.. చెల్లనిచెక్కులు ఇచ్చిందంటూ.. రాంచీకి చెందిన అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి కేసు వేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే... సినిమాల మీది ఇంట్రెస్ట్ తో.. ఆరంగంలో పెట్టుబడులు పెట్టాని నిర్ణచుకున్న వ్యాక్తి.. అమిషాతో చేతులు కలిపాడు. ఇద్దరు కలిసి వెంటనే దేశీ మ్యాజిక్ అనే సినిమాని స్టార్ట్ చేశారు.
ఈసినిమా కోసం అజయ్ కుమార్ నుంచి 2.5 కోట్లు తీసుకుందంట అమిషా. సినిమా కరెక్ట్ టైమ్ కే స్టార్ట్ చేసింది కాని.. కాని ఇప్పటి వరకూ సినిమా పూర్తి అవ్వలేదు. ఇన్నేళ్లు గడుస్తుననా సినిమా మీద దృష్టి లేకపోవడంతో.. తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అజయ్ సింగ్ అమీషాను కోరారడట దాంతో ఆమె 2కోట్లకు ఒక చెక్.. 50 లక్షలకు ఒక చెక్ ఇచ్చిందట. అయితే అవి బౌన్స్ అయినట్టు తెలుస్తంది.
అయితే ఆ చెక్ లు బౌన్స్ అవ్వడంతో అజయ్ సింగ్ కోర్ట్ ని ఆశ్రయించాడు. అమిషా పటెల్ మరియు ఆమె బిజినెస్ పార్ట్‌నర్ క్రునాల్ పై రాంచీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఇక కోర్టులో విచారణ జరగ్గా.. న్యాయస్తానం అమిషా పటెల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక 420, 120 సెక్షన్ల కింద చీటింగ్ కేసుగా అమీషాను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 15కు తదుపరి విచారణ వాయిదా వేశరు. ఇప్పుడు మాత్రమే కాదు. గతంలో కూడా అమీషాపై ఇటువంటి కేసులు నమోదు అయ్యాయి.
