కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన ప్రతి సినిమాతో ఎదో ఒక రికార్డ్ ను క్రియేట్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. రజినీకాంత్ తరువాత కోలీవుడ్ లో ఆ స్థాయి మార్కెట్ ఉన్న హీరోగా విజయ్ తన సత్తా చాటుతున్నాడు. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమా ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

అయితే సర్కార్ సినిమా కొన్ని ఏరియాల్లో రజినీకాంత్ కలెక్షన్స్ ని కూడా బీట్ చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకున్న విజయ్ ఒక్క చెన్నైలోనే 2 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కాలా సినిమాతో 1.7కోట్లతో మొదటి స్థానంలో ఉన్న రజినీకాంత్ రికార్డ్ ను సర్కార్ సినిమాతో విజయ్ బ్రేక్ చేశాడు. 

బయ్యర్స్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందినట్లు చెబుతున్నారు. మొదటి రోజు తమిళనాడులో 30కోట్ల వరకు కలెక్షన్స్ అందినట్లు సమాచారం. ఇక అమెరికాలో కూడా సినిమా బాగానే రాబట్టింది గాని మెర్సల్ రేంజ్ లో అయితే డాలర్స్ ను ప్రీమియర్స్ ద్వారా రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది.