అర్జున్ రెడ్డితో ఆకట్టుకున్న షాలిని మహానటిలో కీలక పాత్రకు ఎంపికైన షాలిని వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న షాలిని

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం చాలా మంది హీరోయిన్లుగా పరిచయమౌతూ ఉంటారు. వారిలో కొందరు వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని.. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మరి కొందరు.. వరసగా అవకాశాలు దక్కినా.. వాళ్లకు పెద్దగా కలిసి రాదు. మరికొందరు అసలు.. మొదటి సినిమానే ఆఖరి సినిమాగా కూడా మారుతుంది.

ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో.. సాయిపల్లవి, షాలినీ పాండే, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్ లాంటి వాళ్లు.. వాళ్లకి వచ్చిన ఒక్క అవకాశంతో ప్రేక్షకులను మెప్పించి.. వరసగా సినిమాలను చేజిక్కించుకుంటున్నారు. వీరిలో షాలినీ పాండే కూడా ఒకరు. ఈ బ్యూటీ... అర్జున్ రెడ్డి సినిమాతో ఒవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించి ‘మహానటి’ లో కూడా ఛాన్స్ కొట్టేసింది.

తాజాగా ‘100% లవ్’ సినిమా తమిళ రిమేక్ లోనూ అవకాశం చేజిక్కించుకుంది. సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, తమన్న నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా నటంచిన మహాలక్ష్మి పాత్రకు మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ క్రేజీ పాత్రలో మన ముద్దుల షాలిని నటించబోతోంది. మొదట ఈ సినిమాలో లవాణ్య త్రిపాఠిని తీసుకుందామని అనుకున్నారు. కానీ.. లవాణ్యకు సినిమా అవకాశాలు అడపా దడపా వస్తున్నా.. అందులో విజయం సాధించినవి చాలా తక్కువ. అందుకే ఆమెను కాదని షాలినీని ఎంచుకున్నారు. ఈ సినిమాకి చంద్రమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్నారు.