టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్టుకోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో నిఖిల్ ఒకరు. మనోడి టైమ్ ఈ మధ్య అస్సలు బాలేదు. బాక్స్ ఆఫీస్ హిట్టు కథలను ఏరికోరి మరి రీమేక్ చేస్తున్నా ప్లాప్ లేదా విడుదల కావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు చేసిన కిర్రాక్ పార్టీ కన్నడ రీమేక్. 

ఇప్పుడు తమిళ్ కనితన్ ను తెలుగులో అర్జున్ సురవరంగా వదలబోతున్నాడు. కిర్రాక్ పార్టీ దారుణంగా ప్లాప్ అవ్వడంతపో ఈ రీమేక్ తో అయినా హిట్టందుకోవాలని కష్టపడుతుంటే మొదట ముద్ర అని టైటిల్ ఫిక్స్ చేసుకోగా అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు అర్జున్ సురవరం రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చెప్పడంతో నిఖిల్ సినిమాపై జనాల్లో ఆసక్తి తగ్గుతోంది. 

మే 1న అర్జున్ సురవరం రిలీజ్ కానున్నట్లు ప్రమోషన్స్ డోస్ పెంచుతున్న నిఖిల్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి. టిసంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీకి కూడా గత కొంత కాలంగా హిట్స్ లేవు.సో.. లావణ్య కెరీర్ కు కూడా అర్జున్ సురవరం చాలా ఇంపార్టెంట్.