కొఠారి మాట్లాడుతూ...అర్జున్‌ కేవలం శ్రుతిని భయపెట్టడానికే ఆ పిటిషన్‌ వేసి మీడియాలో హైప్ క్రియేట్ చేసారు. అర్జున్‌ ఐదుకోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది నిజమే, అయితే ఆ పిటిషన్‌ విచారణకు రావాలంటే కోర్టు ఫీజు చెల్లించాలి. కోర్ట్ రూల్ ప్రకారం ఎంత పరువు నష్టం దావాను వేస్తున్నారో.. అందులో పదోవంతు డబ్బు కోర్టుకు చెల్లించాలి.. ఆ తర్వాతే పిటిషన్‌ విచారణకు వస్తుంది. అయితే అర్జున్‌ ఇప్పటివరకూ కోర్టు ఫీజు కట్టలేదు.

కేవలం పిటిషన్‌ దాఖలు చేశాడని, శ్రుతిని భయపెట్టడానికే ఆ పిటిషన్‌ వేసి, మీడియాలో వార్తలు వచ్చేలా చూసుకుని ఆమెను భయపెడుతున్నాడని శ్రుతి లాయర్‌ అంటోంది. పరువు నష్టం దావాపై విచారణను ఎదుర్కొనేందుకు కూడా శ్రుతి సిద్ధంగా ఉందని ఆ లాయర్‌ చెప్పుకొచ్చింది. అయితే ఆ పిటిషన్‌ కోర్టులో విచారణకు వచ్చినప్పుడల్లా అర్జున్‌ లాయర్‌ వాయిదాను కోరుతున్నాడని, వారే వాయిదా వేయించుకొంటూ వెళ్తున్నారని అన్నారామె.

ఇక కన్నడనాట ‘లూసీ’తో మంచి పేరు తెచ్చుకున్న శ్రుతి.. తెలుగు సినిమా గురించి మాట్లాడింది.  ఆ మధ్యన ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన ప్రకటన చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే.. అక్కడ డైరెక్టర్ లైంగిక వాంఛలు తీర్చాల్సిందేనని చెప్పింది. 

‘‘నేను సినిమా ఇండస్ట్రీలోకి పేరు..ప్రతిష్ఠల కోసం రాలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలు పెద్దవి. వాటి నుంచి నేను వీలైనంత దూరంగా వెళతాను. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను భయపెడుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాన్స్ దక్కాలన్నా.. ఆఫర్లు నిలుపుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా.. సినీ ప్రముఖులు లైంగిక వాంఛలు (కాస్టింగ్ కౌచ్) తీర్చాల్సిందే. గౌరవం, మానం అన్నీ వదులుకోవాల్సిందే. 

నేను వాటికి సిద్ధంగా లేను. అందుకే తెలుగుకు ఆమడ దూరం ఉంటున్నా. నా గౌరవాన్ని వదులుకొని సినిమాలు తీసేందుకు సిద్ధంగా లేను. అది లేకుండా కూడా నేను బతకగలను. అంతేగానీ.. తల మాత్రం దించుకోలేను. తెలుగుతో పోలిస్తే.. కన్నడలో కాస్టింగ్ కౌచ్ అంతగా లేదు. ఒకవేళ అది లేకుండా తెలుగులో ఆఫర్ వస్తే శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సినిమా తీయాలని ఉంది. తమిళంలో మణిరత్నం, బాలా డైరెక్షన్లో సినిమా చేయాలని ఉంది’’ అని ఈ కన్నడ బ్యూటీ తేల్చేసింది.