టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగా ఇంట్లో విషాదం నెలకొంది. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డైరెక్టర్ మాతృమూర్తి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున తుది శ్వాసను విడిచారు, తెలంగాణలోని వరంగల్, వెంకటయ్య కాలనిలో ఉంటున్న ఆమె ఇంట్లోనే తుది శ్వాసను విడిచినట్లు తెలుస్తోంది. 

ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దర్శకుడు సందీప్ అర్జున్ రెడ్డి సినిమాను ఇటీవల బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మరో కథను సిద్ధం చేసే పనుల్లో ఉన్న దర్శకుడికి మాతృ వియోగం తీరని బాధని కలిగించింది. నెక్స్ట్ సందీప్ క్రైమ్ థ్రిల్లర్ కథతో వచ్చే అవకాశం ఉన్నట్లు  ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.