అర్జున్ రెడ్డి సినిమాతో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యువ దర్శకుడు సందీప్ వంగ అదే కథతో బాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్ అందుకున్నాడు. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి కథతో వస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. మహేష్ బాబుతో ఒక సినిమా సెట్టయ్యింది అని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై ఇంకా ఇరువురి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. 

ఫైనల్ గా బాలీవుడ్ లోనే ఈ దర్శకుడు ఒక సినిమా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కబీర్ సింగ్ నిర్మాతలు సందీప్ తో మరో  సినిమాను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ తో ఆప్రాజెక్ట్ ను సెట్ చేసుకునేందుకు నిర్మాతలు దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే సందీప్ షాహిదీ కి స్టోరీ లైన్ వినిపించాడట, కథ నచ్చడంతో అతను మరోసారి సందీప్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ స్టోరీని తెలుగులోనే చేస్తాడనుకున్న సందీప్ మళ్ళీ బాలీవుడ్ బాట పట్టడంతో ఇప్పట్లో అతను తెలుగు సినిమా చేయలేడు అనే టాక్ వైరల్ గా మారింది.