పవన్ సినిమా తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు ల కాంబినేషన్ లో మూవీ అర్జున్ రెడ్డి సక్సెస్ తో బడా హీరోల దృష్టిలో పడ్డ దర్శకుడు సందీప్ సందీప్ మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేశానంటూ త్రివిక్రమ్ సినిమాకు ఎసరు పెట్టాడా
"అర్జున్ రెడ్డి” సినిమాతో టాప్ హీరోల దృష్టిలో పడిన సందీప్ రెడ్డితో సినిమాలు చేయడానికి చాలమంది హీరోలు ఆసక్తి కనపరుస్తూ సంకేతాలు పంపుతున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నట్లు వార్తలు రావడమే కాకుండా ఒక మంచి కధను మహేష్ కోసం సిద్ధం చేస్తున్నట్లుగా ఇప్పటికే సందీప్ రెడ్డి ప్రకటించాడు కూడా.
ఇప్పుడు ఆ ప్రకటనే త్రివిక్రమ్, మహేష్ ను డిస్ట్రబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మహేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమాను చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత... త్రివిక్రమ్ వచ్చే ఏడాది చివరిలో మహేష్ తో ఒక సినిమా తీయడానికి ప్రాధమిక చర్చలు కూడ పూర్తి అయ్యాయన్న వార్తలు ఉన్నాయి. అయితే అన్నీ కుదిరితే వచ్చేఏడాది చివరి నుండి మహేష్ సందీప్ రెడ్డిల సినిమా ఉండటం ఖాయం అని అంటున్నారు.
ఆ సమయానికి మహేష్ వంశీ పైడిపల్లి మూవీ ప్రాజెక్ట్ నుండి కూడ బయటకు వస్తాడు కాబట్టి సందీప్ రెడ్డికి మహేష్ డేట్స్ దొరకడం పెద్ద కష్టం కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో మహేష్ త్రివిక్రమ్ ల మూవీ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో ‘శ్రీమంతుడు’ ప్రొడ్యూసర్స్ మైత్రీమూవీ మేకర్స్ సంస్థతో త్రివిక్రమ్ చేయవలసిన సినిమాలో సందీప్ రెడ్డి వచ్చి చేరడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే త్రివిక్రమ్ కు కాస్త చిరాకు తెప్పించే అంశమే.
