అర్జున్ రెడ్డి కలెక్షన్స్ ఫస్ట్ డే లో రూ.4 కోట్లు విజయ్ దేవరకొండకు భారీ స్టార్ డమ్ నిర్మాతలు, బయ్యర్లకు కాసులు కురిపిస్తున్న సినిమా
విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ ముందే భారీ హైప్ రావడం 'అర్జున్ రెడ్డి'కి బాగా కలిసొచ్చింది. ప్రేక్షకుల అంచనాలు వందకు వందశాతం అందుకున్న ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'అర్జున్ రెడ్డి' చిత్రం తొలి రోజు రూ. 4 కోట్లు వసూలు చేసింది.
పెద్ద పెద్ద స్టార్లు లేక పోయినా, భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కాకపోయినా సినిమాకు తొలి రోజే ఇంత కలెక్షన్ రావడం గొప్పే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు 4 నుండి 5 రెట్లు లాభాలు తెచ్చి పెడుతుందని టాక్.
‘అర్జున్ రెడ్డి' సినిమాకు కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు ఉన్న క్రేజ్, కలెక్షన్ల జోరు చూస్తుంటే ఓవరాల్ రన్‌లో రూ. 20 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి' చిత్రాన్ని యూఎస్ బయ్యర్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేశాడు. కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఇంతకు మించిన మొత్తం అతడికి తిరిగి వచ్చిందట. ఇక లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
అర్జున్ రెడ్డి మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం... సినిమా ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీల కంటే కొత్తగా ఉండటం, మేకింగ్ రియలిస్టిక్ గా ఉండటం. వీటన్నింటికీ మించి విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ సినిమాకు బాగా ప్లస్సయింది.
