మరో వివాధంలో అర్జున్ రెడ్డి సినిమా. మహిళ సంఘాల పోలీస్టేషన్ లో కంప్లైంట్.

"అర్జున్ రెడ్డి" మ‌రోసారి రచ్చ‌కెక్కింది. నిన్న కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకుడు వి.హ‌నుమంతరావు బ‌స్సు పై ఉన్న అర్జున్ రెడ్డి పోస్ట‌ర్‌ని చించివేసిన విష‌యం తెలిసిందే, దానికి విజయ్ దేవరకొండ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించి, "తాతయ్య, చిల్" అంటూ ఓ స్మైలీ ఈమోజీని అటాచ్ చేశారు. 


ఇక ఆ స‌మ‌స్య అంత‌టితో ముగిసింద‌నుకుంటే నేడు మ‌రో స‌మ‌స్య అర్జున్ రెడ్డిని వెంటాడుతుంది. ఈ సినిమా లిప్ లాక్ పోస్టర్స్ న‌గ‌ర వ్యాప్తంగా బాగా ప్ర‌చారం చేశారు, ఆ పోస్ట‌ర్ల పట్ల మహిళా సంఘాల నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ సినిమా దర్శకుడిని వాళ్లు పోలీస్ స్టేషన్ కి పిలిపించినట్టు తెలుస్తోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన "అర్జున్ రెడ్డి" సినిమా, ఈ నెల 25వ తేదీన భారీస్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్ప‌టికే హీరో విజ‌య్ గ‌తంలో ఈ సినిమా గురించి చేసిన కామెంట్ల ప‌ట్ల‌ ప‌లువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాట‌న్నింటికి నిన్న జ‌రిగిన అర్జున్ రెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవేంట్ విజయ్ "నా సినిమా పై నేను కాన్షిడెంట్ గా లేక‌పోతే ఎవ‌రు.. ఉంటారు" అని తిరిగి ప్ర‌శ్నించారు.. ఈ నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ కి ముందే ఈ సినిమా పై ఇటు నాయకులు, అటు మహిళ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇలా ఈ సినిమా విడుదలకి ముందే నానా రచ్చ జరుగుతుంది.

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి