Asianet News TeluguAsianet News Telugu

ట్రైలర్ రేపే.. ‘భగవంత్ కేసరి’ నుంచి అర్జున్ రాంపాల్ ఫవర్ ఫుల్ పోస్టర్..

‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రేపు విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాంపాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను  యూనిట్ విడుదల చేసింది. పవర్ ఫుల్ లుక్ లో ఆసక్తిని పెంచేలా ఉంది. 
 

Arjun Rampal first look from Bhagavanth Kesari Movie NSK
Author
First Published Oct 7, 2023, 2:56 PM IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ (Arjun Rampal)  టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari).  నందమూరి బాలకృష్ణ (Bala Krishna) - యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన నటిస్తోంది. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా కూతురి పాత్రలో అలరించబోతోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై చిత్రం రూపుదిద్దుకుంది. ఈనెలలోనే గ్రాండ్ గా విడుదల కాబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. రీసెంట్ గానే ‘జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి’ వీడియో, మెలోడీ ట్రాక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక గతంలో వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కూడా సినిమాపై హైప్ ను పెంచేశాయి. రిలీజ్ విషయంలోనూ ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన మేకర్స్ .. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కాస్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుంచి రేపు Bhagavanth Kesari Trailer విడదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా మరో అప్డేట్ అందించారు.

అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారని యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి కింద ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. స్టైలిష్ అండ్ పవర్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రాయల్  లుకింగ్ తో తన పాత్రపై ఆసక్తిని పెంచేశారు. రాహుల్ సంఘవి అనే రోల్ తో అలరించబోతున్నారని యూనిట్ తెలిపింది. పోస్టర్ రిలీజ్ తర్వాత ఆయన పాత్రను అనిల్ రావిపూడి చాలా పవర్ ఫుల్ గా క్రియేట్ చేశారని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ట్రైలర్ రేపు సాయంత్రం 8:16 గంటలకు రానుంది. అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios