దివంగత శ్రీదేవి.. బోణీకపూర్ కి రెండో భార్య అనే సంగతి తెలిసిందే. బోణీ కపూర్ మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్, అంశులా లకి శ్రీదీవితో పెద్దగా రిలేషన్ ఉండేది కాదు. ముఖ్యంగా అర్జున్ కపూర్ కి శ్రీదేవి అంటే అసలు పడేది కాదు.

అటువంటిది ఆమె మరణించిన తరువాత అర్జున్ కపూర్ దగ్గరుండి ఆమె అంత్యక్రియలకు సంబంధించిన పనులు చూసుకున్నాడు. శ్రీదేవి ఇద్దరు కుమార్తెలకు తన సపోర్ట్ అందించాడు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న అర్జున్ కపూర్ కి శ్రీదేవి మరణం తరువాత ఎలా రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు.

దానికి సమాధానంగా.. ''ఆమె చనిపోయిందని తెలిసిన వెంటనే నా జీవితం మొత్తం మారిపోయింది. ఎంతటి శత్రువుకైనా ఇటువంటి పరిస్థితి రాకూడదు. నేను, నా సోదరి ఏం చేయాలో అన్నీ చేశాం. జాన్వీ, ఖుషీలను ఓదార్చాం.

అలాంటి సమయంలో మా సపోర్ట్ ఎంత అవసరమో గ్రహించాం. మా అమ్మ ఈరోజు బతికిఉన్నా ఆమె కూడా వారికి సపోర్ట్ ఇవ్వాలనే చెప్పేది. మనసులో ఎలాంటి ద్వేషం పెట్టుకోకూడదు'' అంటూ చెప్పుకొచ్చాడు. అర్జున్ కపూర్ కి శ్రీదేవికి మధ్య అనుబంధం లేనప్పటికీ ఆమె పిల్లల బాధ్యతని అర్జున్ కపూర్ చూసుకుంటున్నాడు!