బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరాలు డేటింగ్ లో ఉన్నారంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ కంటే మలైకా వయసులో 11 ఏళ్లు పెద్దది. అయినా వీరిద్దరూ డేటింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా అర్జున్ కపూర్ ఫ్యాన్ ఒకరు అటు తల్లి శ్రీదీవి, ఇటు మలైకా అరోరాలను పోలుస్తూ ఓ ప్రశ్న అడిగారు. 'మీరు శ్రీదేవిని ద్వేషించేవారు కదా.. ఎందుకంటే మీ తండ్రి బోనీకపూర్ మీ అమ్మను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకున్నారని.. మరి మీరు వయసులో మీకంటే 11 ఏళ్లు పెద్దదైన మహిళతో ఎలా డేటింగ్ చేస్తున్నారు..? పైగా ఆమెకి ఓ టీనేజ్ కొడుకు కూడా ఉన్నాడు. మీ తండ్రికి ఒక రూల్ మీకొక రూలా..?' అంటూ ప్రశ్నించారు. 

అది చూసిన అర్జున్ ఆ నెటిజన్ ను ఉద్దేశిస్తూ.. 'నాకు ఎవరిపైనా ద్వేషం లేదు.. కాకపోతే నా తండ్రి రెండో కుటుంబానికి నేను కాస్త దూరంగా ఉండేవాడిని.. మీరన్నట్లు నేను శ్రీదేవిని ద్వేషించి ఉంటే.. ఆమె కుమార్తెలు జాన్వీ, ఖుషిలను నా చెల్లెళ్లుగా స్వీకరించేవాడిని కాదు కదా..? కామెంట్ చేయడం సులువే.. కానీ అలా అనేముందు కాస్త ఆలోచించండి' అంటూ కౌంటర్ ఇచ్చాడు.