అర్జున్ కపూర్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అర్జున్ కపూర్ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన కోస్టార్స్, ఇతర నటీనటుల్ని సోషల్ మీడియా వేదికగా ఆటపట్టిస్తుంటాడు. తాజాగా అర్జున్ కపూర్ చేసిన ఓ కామెంట్ మాత్రం హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. 

ప్రస్తుతం హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. టైగర్ ష్రాఫ్ తాజాగా ఇంస్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. టైగర్, హృతిక్ కింద కూర్చుని ఉండగా సిద్దార్థ్ ఆనంద్ మాత్రం వారి పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్నాడు. 

దీనిపై అర్జున్ కపూర్.. ఒక లెజెండ్.. ఇద్దరు సాధారణ నటులు అని కామెంట్ చేశాడు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లని సాధారణ నటులు అని చెప్పడంతో వారి అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. దీనితో అర్జున్ కపూర్ ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. 

నీకు కనీసం టైగర్ ష్రాఫ్ తో పోల్చుకుని స్థాయి కూడా లేదు. అలాంటిది హృతిక్ రోషన్ ని సాధారణ నటుడు అంటావా అంటూ మండిపడుతున్నారు. అర్జున్ కపూర్ అభిమానులు మాత్రం ఆ ఫోటోపై ఫన్నీగా చేసిన కామెంట్ తప్ప అందులో అగౌరవపరిచే ఉద్దేశం లేదని అతడిని సమర్థిస్తున్నారు.