Asianet News TeluguAsianet News Telugu

ఈ ఏడాది అత్యంత చెత్త సినిమాగా రికార్డ్.. కోట్ల బడ్జెట్‌, 2 లక్షల కలెక్షన్లు..

2023 కి స్వస్తి చెప్పి.. 2024 కి వెల్కం చెప్పడానికి  అంతా రెడీగా ఉన్నారు. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది తీపి చేదులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు సినిమా ప్రియులు. ఈక్రమంలో ఈ ఏడాది మోస్ట్ డిజాస్టర్ మూవీ ఏది.. ? ఎంత వసూలు చేసిందో తెలిస్తే.. నోటిమీద వేలు వేసుకుని మరీ అవునా అంటారు.
 

Arjun kapoor bhumi pednekar Acted Most Disaster Movie the lady killer In 2023 JMS
Author
First Published Dec 29, 2023, 4:08 PM IST

2023 అన్నిరంగాల మాదిరిగానే సినిమా ఇండస్ట్రీపై కూడా రకరకాలుగాప్రభావం చూపించింది. కొంత మంది స్టార్లు సూపర్ డూపర్ హిట్లు కొట్టగా.. అంతే రేంజ్ లోడిజాస్టర్లు కూడా పట్టాయి. దారుణంగా డిజాస్టర్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితేఅంతా గొప్పగా సాధించి కోట్లు గడించిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు కాని.. డిజాస్టర్ మూవీస్ గురించి. ధారుణంగా డిజాస్టర్ అయిన సినిమాల గురించి మాట్టాడుకోరు..వాటికి ర్యాంకింగ్ లు కూడా ఇవ్వరు. కాని ఈ ఏడాది అంటే 2023 లో ధారుణంగా డిజాస్టర్ అయిన సినిమా ఏదో మీకు తెలుసా.. డిజాస్టర్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఈమూవీ ఎంత కలెక్షన్స్ సాధిచిందో తెలుసా..? 

2023లో ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటి పరుగులు పెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి.  కాని 2023లో చెత్త సినిమాగా రికార్డు సాధించింది మాత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయిన లేడీ విలన్ సినిమా. అయితే ఈసినిమా ఏదో అడ్రస్ లేని సినిమా కాదు.. ఇందులో నటించింది చిన్నాచితకా నటులు కాదు. కాని ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. కాని ఇందులో ఎవరు నటించారో తెలుస్తే షాక్ అవుతారు. ఈమూవీలో బాలీవుడ్ యంగ్ స్టార్ అర్జున్ కపూర్ తో పాటు.. బాలీవుడ్ బ్యూటీ భూమీ ఫడ్నేకర్ జంటగా నటించారు. 

దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో లేడీ విలన్ సినిమాను రూపొందించారు. కాని ఇంత ఖర్చు పెట్టి ఇంత మంది స్టార్స్ నటించిన ఈసినిమా ఎంత వసూలు చేసిందో తెలుసా... అక్షరాలా రెండులక్షలు . అవును ఈమూవీ రెండు లక్షల కంటే ఎక్కువగా వసూలు చేయలేదట. నవంబర్‌ 3వ తేదీన రిలీజ్ అయిన ఈమూవీకి అజయ్‌ బెహల్‌ దర్శకత్వం వహించాడు. కేవలం 12 షోలలతోనే సినిమా రిలీజ్ అయ్యిందట. ఫస్ట్ డే న వేల రూపాయలు మాత్రమే వసూలు చేసిన సినిమాగా  కూడా ఇది ఈ ఏడాది రికార్డ్ కొల్ల కొట్టింది. 

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారంజరుగుతోంది. ఇయర్ ఎండ్ టాపిక్స్ లో ఇది హైలెట్ గా నిలిచింది. ఇక ఈ లేడీ విలన్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన  నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios