గ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో అంచనాలకు కూడా అందడంలేదు. ఈ వారం కూడా ఎవరు వెళ్తారా అని చూస్తున్న బిగ్ బాస్ కంటెస్టంట్స్ కు షాక్ ఇచ్చారు ఆడియన్స్.  

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో అంచనాలకు కూడా అందడంలేదు. ఈ వారం కూడా ఎవరు వెళ్తారా అని చూస్తున్న బిగ్ బాస్ కంటెస్టంట్స్ కు షాక్ ఇచ్చారు ఆడియన్స్. 

బిగ్ బాస్ సీజన్ 6 నుంచి మరో వికెట్ పడింది. 21 మందితో స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగుసీజన్ 6 నుంచి మరో వికెట్ పడింది. 7 వారం హౌస్ నుంచి అనూహ్యంగా.. అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆట 7 వారానికి వచ్చేప్పటికి బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. మొదటి వారం నుంచి వరుసగా షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి లు ఎలిమినేట్ అవ్వగా.. లాస్ట్ వీక్ హౌస్ నుంచి ఊహించని విధంగా.. సుదీప ఎలిమినేట్ అయ్యింది. 

బిగ్ బాస్ హౌస్‌లో చాలా వారాలు చప్పగా సాగింది. అయితే గత కొన్ని వారాలుగా కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 6. ముఖ్యంగా ఓటింగ్ విషయంలో రోజు రోజుకూ పరిస్థితి మారిపోతూ వచ్చింది. ఈవారం ఏకంగా 13 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. ఈ 13 మందిలో వాసంతి కాని రాజ్ కాని మెరీనా కాని ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు కాని అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అటు ఆడియన్స్.. ఇటు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు . బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. 

7 వ వారంలో గీతు, ఆర్జే సూర్య తప్ప హౌస్ లో మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. హాట్ హాట్ కామెంట్ల తో వాడీ వేడి చర్చ జరిగింది నామినేషన్స్ లో. ఫైనల్ గా.. అర్జున్ కల్యాణ్ కు దెబ్బ పడింది. అయితే అర్జున్ కల్యాణ్ వెళ్లిపోవడంపై ఆడియ్స్ లో పెద్దగా షాకింగ్ రెస్పాన్స్ ఏమీ రాదనే చెప్పాలి. ఎందుకంటే అర్జున్ కల్యాణ్ కు ఇప్పటికే పులిహోర రాజా, కన్ ఫ్యూజన్ మాస్టర్ లాంటి బిరుదులు ఉన్నాయి. శ్రీసత్య తో పులిహోర కలపడం తప్పించి ఆయన ఆడిందేమి లేదంటున్నారు జనాలు. అదే సమయంలో రొమాన్స్ కి పెద్ద కొరతే వచ్చిందంటున్నారు.

 కాస్తో కూస్తో ఈ వారమే అర్జున్ గేమ్ ఆడాడు. కాని ఈ వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. అసలు శ్రీ సత్య చీ అన్నా కూడా ఆమె వెనకాల తిరుగుతూ... టీమ్ అంతా ఆడాల్సిన ఆటలో కూడా శ్రీసత్య కోసం ఓడిపోయి చీప్ అయిపోయిన అర్జున్ కల్యాణ్.. అసలు ఇన్ని రోజులు హౌస్ లో ఉండటమే ఎక్కువ అని అభిప్రాయ పడుతున్నారు ఆడియన్స్. ఇన్నాళ్లు వీరిద్దరి మధ్య కాస్త కంటెంట్ క్రియేట్ అవుతుందన్న కారణంగా అర్జున్ కల్యాణ్ ను ఇన్ని వారాలు బరించారు. 

అయితే అటు శ్రీసత్య అర్జున్ ను పట్టించుకోకుండా తన ఆట తాను పర్ఫెక్ట్ గా ఆడుతోంది. కాని అర్జున్ కల్యాణ్ మాత్రం శ్రీ సత్య చుట్టూ తిరుగుతూ.. ఆటను పక్కన పెట్టేశాడు అన్న విమర్ష ఉంది. దాంతో అతను డేంజర్ జోన్ లో ఉన్నాడని చూసేవాళ్లందరికి తెలుస్తూనే ఉంది. సో మొత్తానికి అర్జున్ కల్యాణ్ 7 వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే ఈ ఎపిసోడ్ ఆదివారం ప్లే అవుతుంది. మరి అర్జున్ కల్యాణ్ వెళ్లిపోతే శ్రీ సత్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూడాలని ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.