మోహన్ లాల్ హీరోగా రూపొందిన `తుడరుమ్` మూవీ బాక్సాఫీసు వద్ద ఇంకా రచ్చ చేస్తూనే ఉంది.ఈ చిత్రం మోహన్‌లాల్ గత రికార్డులను బ్రేక్ చేస్తుండటం విశేషం.
కొత్త సినిమాకి మంచి మౌత్ పబ్లిసిటీ రావడం కొంచెం కష్టమైన పనే. కానీ ఆ ఘనత సాధిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఆ కోవలోకి వచ్చే సినిమాల్లో తాజా చిత్రం `తుడరుమ్`. మోహన్ లాల్- తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల,
విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. అది కూడా విడుదలై 20 రోజుల్లోనే. ప్రస్తుతం మంచి బుకింగ్‌లతో దూసుకుపోతున్న `తుడరుమ్` గురించి నటుడు అర్జున్ దాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మోహన్ లాల్ సార్ బెంజ్‌గా మారడం చూశాను..
"లాల్ సార్ బెంజ్‌గా మారడం నేను స్వయంగా చూశాను. అది నా జీవితంలో బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ లో ఒకటి. ఈ అవకాశం కల్పించినందుకు తరుణ్ మూర్తికి చాలా ధన్యవాదాలు" అని అర్జున్ దాస్ అన్నారు. `తుడరుమ్` షూటింగ్ సమయంలో తరుణ్ మూర్తితో కలిసి ఉన్న తన ఫోటోను కూడా అర్జున్ పంచుకున్నారు. దీన్ని తరుణ్ మూర్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
`తుడరుమ్` సెట్ లో మోహన్ లాల్‌ని డైరెక్ట్ చేయడం చూసిన అర్జున్ దాస్
గతంలో `తుడరుమ్` షూటింగ్‌కు అర్జున్ దాస్ వచ్చారు. ఆ తర్వాత అర్జున్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, "'టోర్పెడో' సినిమా గురించి చర్చించడానికి వెళ్ళినప్పుడు అర్జున్‌తో పరిచయం ఏర్పడింది.
దానికి ముందే `తుడరుమ్` చేయబోతున్నానని అర్జున్‌కి చెప్పాను. అప్పుడు అర్జున్ నన్ను ఒకటే కోరాడు. లాల్ సార్‌ని డైరెక్ట్ చేస్తున్న ఒక్క షాట్ చూడాలని. అతని కోరిక మేరకే `తుడరుమ్` సెట్‌కి వచ్చాడు" అని తరుణ్ మూర్తి గతంలో స్పందించారు.
అర్జున్ దాస్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ `ఓజీ`లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నేడు పవన్ ఈ మూవీ షూటింగ్‌లోకి అడుగుపెట్టాడు. యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారట.