ఇండస్ట్రీలో ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే.. బుచ్చిబాబుకి జీవితాంతం రుణపడి ఉంటా, అర్జున్ అంబటి కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో అర్జున్ అంబటి కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడిగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7లో అర్జున్ వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో అర్జున్ అంబటి కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడిగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7లో అర్జున్ వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇతర కంటెస్టెంట్ లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకున్నాడు. ఫిజికల్ గేమ్స్ లో అర్జున్ అదరగొట్టాడు. అతడి కూల్ యాటిట్యూడ్ అందరిని మెప్పించింది.
RC 16లో అర్జున్ అంబటి
బిగ్ బాస్ సీజన్ 7 లో అర్జున్ అంబటికి మరో మంచి విషయం కూడా జరిగింది. బిగ్ బాస్ సీజన్ 7లో వేదికపైకి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఆర్సీ 16 చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రాంచరణ్ కెరీర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
బుచ్చిబాబు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటా
బుచ్చిబాబు బిగ్ బాస్ షోలో అర్జున్ కి ఆఫర్ ఇచ్చారు. అర్జున్ నీవు రాంచరణ్ ఆర్సీ 16లో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పారు. దీనితో అర్జున్ ఎగిరి గంతేశారు. ప్రస్తుతం ఆర్సీ 16 షూటింగ్ ప్రారంభం అయింది. అర్జున్ అంబటి బుచ్చిబాబు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అర్జున్.. బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని, నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే.
Also Read : శంకర్ ఫీల్ అయినా పర్వాలేదు, రాంచరణ్ గురించి రాజమౌళి చెప్పింది నిజమే
ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. అయినా ఛాన్స్ వస్తుంది అనే గ్యారెంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇచ్చారు. బుచ్చిబాబు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటా అని తెలిపారు.
ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యం మంచి నటుడిగా ఎదగడమే అని అర్జున్ అంబటి తెలిపారు. ఆర్సీ 16 చిత్రం రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఆ చిత్రానికి పది రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామా
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ చిత్రం కోసం డిఫెరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ హడావిడి ముగిసిన తర్వాత ఆర్సీ 16 గురించి మరిన్ని అప్డేట్స్ రావడం ఖాయం. రాంచరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో ఆర్సీ 16 చిత్రాన్ని ప్రారంభించారు. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ అంబటి.. అశ్వమేథం, త్రికాల, తీస్ మార్ ఖాన్ లాంటి చిత్రాల్లో నటించారు. మరి ఆర్సీ 16 చిత్రం అర్జున్ అంబటి ఇమేజ్ ఎలా పెంచుతుందో చూడాలి.