రేపటి నుంచి సంక్రాంతి సినిమాలు మొదలైపోతున్నాయి. థియోటర్స్ మొత్తం వాటితోనే నిండిపోనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో ఆడుతున్న కేజీఎఫ్ ని సైతం తీసేయనున్నారు. దాంతో ఈ చిత్రం లాభ,నష్టాల లెక్కల్లో పడ్డారు. ఈ సినిమా అన్ని చోట్లా మంచి హిట్ టాక్ సంపాదించింది. మరి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు ఏ మేరకు లాభం సంపాదించింది అనేది ఏరియా వైజ్ చూద్దాం. 

కన్నడ సినిమా 'కేజీఎఫ్'  ను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ  సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు(17 రోజుల) వసూళ్ల సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రం ఇప్పటివరకూ  10.25  కోట్ల వరకూ షేర్ కలెక్ట్ చేసిందని సమాచారం. ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఈ సినిమా రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమా నైజాం, సీడెడ్ లో దుమ్ము రేపింది. 

మొదట్లో ఈ సినిమాకు ముందు కనీసం పోస్టర్ ఖర్చులైనా వస్తాయా అని నవ్వుకున్న వాళ్ళు  ఈ కలెక్షన్స్ జోరు చూసి షాక్ అయ్యి చూస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది.   

ఏరియావైజ్ బ్రేకప్:

నైజాం : రూ. 4.14 కోట్లు

సీడెడ్ : రూ. 1.95 కోట్లు

వైజాగ్ : రూ. 1.18 కోట్లు

ఈస్ట్ గోదావరి : రూ. 0.61 కోట్లు

వెస్ట్ గోదావరి : రూ. 0.49 కోట్లు

కృష్ణా : రూ. 0.91 కోట్లు

గుంటూరు : రూ. 0.76 కోట్లు

నెల్లూరు : రూ. 0.24  కోట్లు

మొత్తం  ఆంథ్రా/తెలంగాణా షేర్   : రూ. 10.25   కోట్లు

ఈ సినిమాను రాజమౌళి, ప్రభాస్ వంటి స్టార్లు ప్రమోట్ చేయటం  ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  పక్కా మాస్ తరహాలో సినిమాను తెరకెక్కించారు. కన్నడ రాక్ స్టార్ యాష్ నటన ఆకట్టుకోవడంతో.. సినిమా సక్సెస్ అయింది.