మహేష్ హీరోయిన్ ప్రేమలో పడిందా..?

Are Sidharth Malhotra and Kiara Advani dating?
Highlights

ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ తరచూ కియారాను కలుస్తుండడం పలుమార్లు కెమెరా కంటపడింది. తాజాగా కియారా పుట్టినరోజు వేడుకకు కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి

'ఎం.ఎస్.ధోని' చిత్రంతో బాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ కియారా అద్వానీ. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కావడంతో తెలుగు వారికి కూడా దగ్గరైంది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ కనిపించి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలానే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారు. తాజాగా అమ్మడు ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో నటిస్తూనే బాలీవుడ్ లో కూడా బిజీ అవుతోన్న ఈ బ్యూటీ సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా కనిపిస్తోంది. గతంలో అలియా భట్ తో ప్రేమాయణం నడిపించాడు సిద్ధార్థ్ మల్హోత్రా.

కానీ ఆమె ప్రస్తుతం రణబీర్ కపూర్ తో రిలేషన్ లో ఉండడంతో సిద్ధార్థ్ కొన్నాళ్ల పటు జాక్వెలిన్ తో వ్యవహారం నడిపించాడని అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ తరచూ కియారాను కలుస్తుండడం పలుమార్లు కెమెరా కంటపడింది. తాజాగా కియారా పుట్టినరోజు వేడుకకు కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. మరి ఈ విషయంపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి!
 

loader