వీర రాఘవుడిగా ఎన్టీఆర్ ఉగ్రరూపం!

aravinda sametha veera raghava movie first look poster
Highlights

'జై లవకుశ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి 

'జై లవకుశ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా విడుదల చేసింది. టైటిల్ గా ముందుగా చాలా పేర్లు వినిపించాయి. త్రివిక్రమ్ మాత్రం ఎప్పటిలానే సరికొత్త టైటిల్ తో ప్రేక్షకులను అలరించాడు.

అదే 'అరవింద సమేత వీర రాఘవ'. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తూనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే భావనను కలిగిస్తోంది. ఇక ఈ పోస్టర్ లో కత్తి పట్టి రక్తపు మరకలతో నడుస్తూ వస్తోన్న ఎన్టీఆర్ ఉగ్రరూపం మాములుగా లేదు. ఆయన ఆరు పలకల ఆహార్యం అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా పోస్టర్ ను బట్టి తారక్ తన లుక్ విషయంలో ఎంతగా కష్టపడ్డాడో అర్ధమవుతుంది.

పూజహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయనుంది చిత్రబృందం. 
 

loader