ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు సరైన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు చిత్రబృందం. కొన్ని పోస్టర్లు, ఒక టీజర్ ని విడుదల చేసిన మేకర్స్ కొన్ని రోజుల క్రితం పాటలను నేరుగా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేశారు.
ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు సరైన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు చిత్రబృందం. కొన్ని పోస్టర్లు, ఒక టీజర్ ని విడుదల చేసిన మేకర్స్ కొన్ని రోజుల క్రితం పాటలను నేరుగా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటలకు ఆశించిన బజ్ క్రియేట్ కాలేదు.
స్టార్ హీరో సినిమా పాటలకు దక్కే ఆదరణ ఈ సినిమా పాటలకు రాలేదనే చెప్పాలి. పైగా త్రివిక్రమ్ ఈ సినిమాను రెగ్యులర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. ఎట్టకేలకు అరవింద సమేత ప్రమోషనల్ యాక్టివిటీ చోటు చేసుకోనుంది.
మరికొద్ది సేపట్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. దీనికోసం అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ పైసా వసూల్ ట్రైలర్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.
టీజర్ లో కేవలం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ మాత్రమే కనిపించాయి. కానీ ట్రైలర్ లో మాస్, క్లాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉంటాయని సమాచారం. అన్ని ఎమోషన్స్ ని ఎడిట్ చేసి కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుందని అంటున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!
సంబంధిత వార్తలు..
'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఎలా ఉండబోతుందంటే!
'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?
