కాలేజ్ లో హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్!

aravinda sametha movie new schedule
Highlights

కాలేజ్ స్టూడెంట్ పాత్రలో ఎన్టీఆర్ స్మార్ట్ లుక్ తో కనిపించనున్నాడు. గతంలో కూడా ఎన్టీఆర్ కాలేజ్ స్టూడెంట్ రోల్స్ పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ షెడ్యూల్ ఆగస్టు 3వరకు జరగనుంది

గతేడాది 'జైలవకుశ' చిత్రంతో సక్సెస్ అందుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ' అరవింద సమేత' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ షెడ్యూల్ ను నిర్వహించారు. ఇప్పుడు సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ హీరోయిన్ పూజా హెగ్డేల మధ్య లవ్ ట్రాక్ సీన్స్ షూట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్, పూజా ల మధ్య వచ్చే కాలేజ్ సన్నివేశాలు రొమాంటిక్, కామెడీగా ఉండబోతున్నాయని సమాచారం. కాలేజ్ స్టూడెంట్ పాత్రలో ఎన్టీఆర్ స్మార్ట్ లుక్ తో కనిపించనున్నాడు. గతంలో కూడా ఎన్టీఆర్ కాలేజ్ స్టూడెంట్ రోల్స్ పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఈ షెడ్యూల్ ఆగస్టు 3వరకు జరగనుంది. ఆ తరువాత పొల్లాచిలో పాటల చిత్రీకరణ జరుపుతారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.   

loader