యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ నెల 20న ఆడియో విడుదల కార్యక్రమం ఉంటుందని కొన్ని వార్తలు వినిపిస్తే.. ఆడియో క్యాన్సిల్ అయిందని మరికొందరు అన్నారు. ఇక బాలయ్య గెస్ట్ అంటూ అమరావతిలో ఫంక్షన్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటన్నింటికీ తెర దించుతూ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.
రేపు వినాయక చవితి సందర్భంగా చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 20న జరగనున్నట్లు ప్రకటించారు. ఈ వారంలో సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ అందిస్తామంటూ సినిమా యూనిట్ వెల్లడించింది.
Scroll to load tweet…
