తమిళ హీరో అరవింద్ స్వామీ తెలుగు వారికి కూడా సుపరిచితులే.. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీటూ ఉద్యమంకి సంబంధించి ప్రశ్న ఎదురుకాగా.. ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు.

మొదట నాకేం సంబంధం ఉందని నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారని, దీనికి సమాధానం చెబితే తనకు పబ్లిసిటీ రావడం తప్ప మరేం ఉండదని అన్నాడు. ఆ తరువాత మాట్లాడుతూ.. ''ప్రస్తుతం సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉండడంతో మీటూ గురించి మాట్లాడుతూ పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు.

మీటూకి మద్దతు తెలుపుతున్నట్లుగా వారికి వారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అవతలివారి సమస్యని అడ్డుపెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచించడం చాలా పెద్ద తప్పు. అలాంటిది తప్పుని చాలా మంది చేస్తున్నారు'' అంటూ ఫైర్ అయ్యారు.

అలానే చిన్మయి వివాదంపై స్పందిస్తూ.. ''ఆమె కొందరిని విమర్శించిందని అందరూ వాళ్లను విమర్శించాలని లేదు. దానికి తగ్గ తగినంత సమాచారం ఉంటే అప్పుడు ఆలోచించాలి. ఎవరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు వారు చెప్పుకోవచ్చు కానీ ఇతరుల విషయంలో పబ్లిసిటీ కోసం స్పందించడం తప్పు'' అంటూ చెప్పుకొచ్చాడు.