Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 17వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో అరవింద్ నువ్వు ఇలాగ మాట్లాడుతుంటే నీకు మీ అమ్మకు పెద్ద తేడాగా అనిపించడం లేదు. నువ్వు మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు అనడంతో ఏమన్నావు అరవింద్ అంటుంది మాలిని. నాకు మా మామ్ కి పెద్దగా తేడా లేదా, నేను మా మామ్ లాగా కనిపిస్తున్నానా, నోరుజారుతున్నానా అంటుంది మాలిని. అమ్మ మాలిని అని అనడంతో మీరెవరు మాట్లాడకండి అత్తయ్య చెప్పు అరవింద్ మా అమ్మ తప్పుగా ఏం మాట్లాడింది అంటుంది మాలిని. అనవసరంగా మా మమ్మీనీ ఎందుకు మధ్యలో లాగావు మా మామ్ ఇప్పుడు ఏమనింది చెప్పు అని నిలదీస్తుంది మాలిని.
మా అమ్మ నా కోసమే నా జాగ్రత్త కోసం చెబుతోంది అత్తయ్య గారు నీకు జాగ్రత్తలు చెప్పరా అని నిలదీస్తుంది మాలిని. ఇప్పుడు మా అమ్మను నన్ను ఒక్కదాని చేసి మాట్లాడుతావు కదా నన్ను బాగా అర్థం చేసుకున్నావు థాంక్స్ అరవింద్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. అప్పుడు అనుపమ అరవింద పై సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మీరా జరిగిన విషయాలు తలచుకొని భోజనం తినకుండా భోజనం ముందు అలాగే కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి ప్రకాష్ వస్తాడు. ఏంటత్తా ఇది అనడంతో వద్దు ప్రకాష్ ఆకలి చచ్చిపోయింది అంటుంది మీరా.
అప్పుడు మీరా ప్రకాష్ తో బాధగా మాట్లాడుతుంది. నేను అరవింద్ బాబు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సత్యని తోడుకు తీసుకెళదాము అనుకుంటే సత్య కనిపించడం లేదు. ఎవరు రాకపోయినా నేను ఒక్కదాన్నే వెళ్లి నా బిడ్డ జీవితం నా జీవితం లాగా కాకుండా చూసుకుంటాను అని అంటుంది మీరా. మరొకవైపు అరవింద్ మల్లీ ఇద్దరూ ఆ సింధూరం విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కతో గొడవ పడనని నాకు మాట ఇచ్చారు కదా బాబు గారు ఏమయింది అనడంతో మాట ఇచ్చాను కదా అని నిన్ను అన్నీ మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోవాలా అంటాడు అరవింద్. మాలినీ లాగే నువ్వు కూడా నా భార్యవి నిన్ను జాగ్రత్తగా ఆనందంగా చూసుకోవడం కూడా నా బాధ్యత అంటాడు అరవింద్.
అందరీకి నిజం తెలియక అలా మాట్లాడుతున్నారు నిజం తెలిస్తే వాళ్ళందరూ నిన్ను చూసే విధానం మారిపోతుంది అంటాడు అరవింద్. ఇప్పటికైనా మించి పోయింది లేదు వెళ్దాం పదమ్మ మల్లీ అందరికీ నిజం చెప్పేద్దాము అనడంతో వద్దు బాబు గారు అంటుంది. అప్పుడు మల్లీ ఎంత చెప్పినా వినిపించుకోకుండా అరవింద్ అందరి ముందుకు మల్లీని పిలుచుకోని వెళ్తాడు. అప్పుడు అందర్నీ హాల్లోకి రమ్మని పిలుస్తాడు. ఏంటి అరవింద్ అనడంతో నేను మీ దగ్గర ఎన్నాళ్ళ నుంచి ఒక నిజం దాస్తున్నాను అది అందరికీ తెలియాలి అంటాడు అరవింద్. అప్పుడు అరవింద్ చెప్పబోతుండగా మల్లీ అడ్డుపడడంతో వెంటనే మాలిని సీరియస్ అవుతుంది.
నా భర్తతో నీకేం పని అని మాలినీ అనడంతో నీకే కాదు నేను మల్లీకి కూడా బర్తనే అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు అరవింద్ అనడంతో అవును నీకంటే ముందు నేను మల్లీ మెడలో తాళి కట్టాను అనగా మాలిని షాక్ అవుతుంది. మల్లీతో ఏడడుగులు వేశాను అనడంతో మాలిని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు అనుపమ ఆట పట్టించకు అరవింద్ అనగా నేను చెప్తున్నదీ నిజమే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను అంటే అది మల్లీ పెట్టిన ప్రాణమిచ్చే అంటాడు అరవింద్. ఏం మాట్లాడుతున్నావు అరవింద్ మాలినినీ ఏడేళ్లు ప్రేమించావు అది మర్చిపోయావా అనడంతో అన్ని గుర్తున్నాయి పెద్దమ్మ అని అంటాడు.
అప్పుడు అనుపమ మల్లీ మీద సీరియస్ అవుతుంది. అప్పుడు ఇంట్లో తలా ఒక మాట మల్లీ నీ అంటారు. అప్పుడు అరవింద్ మల్లీ కి సపోర్ట్ గా మాట్లాడుతూ ఇందులో మల్లీ తప్పులేదు నేనే నాది తప్పు అని అంటాడు. అప్పుడు మాలిని మల్లిది కాదు నీదే తప్పు చిన్నప్పటినుంచి ప్రేమించుకున్న కలిసే ఉన్నాము ఏడేళ్లు ప్రేమించుకున్నాము నన్ను ఎలా మోసం చేయాలనిపించింది అని నిలదీస్తుంది మాలిని. నీకు పెళ్లి అయింది అన్న విషయాన్ని పెళ్లి జరగకముందు ఎందుకు చెప్పలేదు అరవింద్ అని నిలదీస్తుంది మాలిని. చెప్పాలి అనుకున్న మాలినీ కానీ నువ్వు అప్పుడు హాస్పిటల్ లో ఉన్నావు అనడంతో చస్తే చచ్చేదాన్ని ఈ రోజు ఇలా చచ్చేదానికంటే ఆరోజు చచ్చి ఉంటే బాగుండు అని అంటుంది.
నువ్వు ఎందుకు చచ్చిపోవాలి మాలిని. మల్లీ నీకు నిజాలు అన్నీ తెలుసు కదా నువ్వెందుకు నిజం చెప్పలేదు అని నిలదీస్తుంది అనుపమ. అప్పుడు మల్లినీ నిలదీస్తూ గుండెపోటుతో కింద పడిపోతుంది అనుపమ. అయితే అదంతా జరిగినట్టు మల్లీ ఊహించుకొని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి బాబు గారు అని అంటుంది. ఆ తర్వాత అరవింద్ నీ అనుపమ ఏం జరుగుతుంది అని నిలదీస్తుంది. అప్పుడు ఇంట్లో అందరూ అరవింద్ నిలదీయడంతో అరవింద్ మౌనంగా ఉంటాడు. ఇంతలోనే అక్కడికి మాలిని కుంకుమ తీసుకుని వచ్చి మల్లీకి ఇస్తుంది.
