Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 20వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో అనుపమ మీరు ఇద్దరు సరదాగా పోట్లాడుకుంటూ ఉంటే మేము చూసి ఎంతో సంతోష పడతాము. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటే అది చూసి మురిసిపోతాము. కానీ ఇదేంటి అరవింద్ గొడవ పడడం ఏంటి అనగా తను కూడా పెట్టుకుంటే నేనేం చేయాలి మామ్ అంటాడు అరవింద్. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చిన అమ్మాయికి ఇష్టా అయిష్టాలు ఉంటాయి అవి తెలుసుకొని అమ్మాయికి ఇష్టమైనవి చేయడమే ప్రేమ అంటే అని అంటుంది అనుపమ. వెంటనే అరవింద్ వాళ్ళ పెద్దమ్మ ఇద్దరి మధ్య తప్పు ఉంటేనే గొడవ అవుతుంది అని అంటుంది.
మేమందరం చెప్పేది ఒకటే మీరు ఇద్దరు మారండి ఇద్దరు దగ్గరవ్వండి అని అంటుంది అనుపమ. ఇదేంటి అరవింద్ మీరు గొడవ పడితే ఏమైనా బాగుంటుందా తను గొడవ పడుతుంటే నేనేం చేయాలి అంటాడు అరవింద్. అప్పుడు అరవింద్ కి అనుపమ అర్థమయ్యే విధంగా చెబుతుంది. ఇప్పుడు మల్లీ చూస్తూ ఉండండి అమ్మగారు ఆ బాబు గారు వెళ్లి మాలిని అక్కతో తప్పకుండా మాట్లాడుతారు అని అంటుంది. ఇంతలోనే అక్కడికి మాలిని సింధూరం తీసుకొని వస్తుంది. ఈ సింధూరంతో నాకంటే నీకు ఎక్కువగా అవసరం ఉన్నట్టుంది తీసుకో మల్లీ అని ఇస్తుంది మాలిని.
అప్పుడు అనుపమ ఏంటమ్మా మాలిని ఇది అనడంతో నాకంటే తనకి ఎక్కువ అవసరం ఉంది అత్తయ్య అందుకే ఇస్తున్నాను అంటుంది. కుంకుమ అంటే ఆడదాని ఐదోతనం దానిని ఎవరికి ఇవ్వాలి అనుకోరు అంటుంది అనుపమ. ఏమో అత్తయ్య మల్లీ ఇచ్చిన కుంకుమను మల్లీకే ఇచ్చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు మాలిని,మల్లీ చెయ్యి పట్టుకొని చేతిలో కుంకుమ భరణి పెట్టగా అది చేయి జారి కింద పడిపోతుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చూసావా వద్దంటే విన్నావా కుంకుమ చేయి జారితే మంచిదనుకుంటున్నావా అనడంతో మనుషులే చేజారుతున్నారు కుంకుమ ఎంత అత్తయ్య అని అంటుంది.
భార్య భర్తల మధ్యలోకి ఎవరు రావడం కరెక్ట్ కాదు కానీ ఒకటే మీరు ఇద్దరు మాత్రం గొడవ పడొద్దు అని చెప్పి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు చూసావా నీవల్ల ఇంట్లో ఎలా జరుగుతుందో అనగా నేను తప్పు చేయలేదు అరవింద్ మల్లీ కి అవసరం ఉంది కాబట్టి ఇచ్చాను అని అంటుంది. అప్పుడు మాలిని అరవింద్ తనకు దూరం అవుతున్నాడని ఏదేదో మాట్లాడుతూ ఉండగా ఎందుకలా మాట్లాడుతున్నావ్ అక్క అనడంతో నువ్వు అలా మాట్లాడిస్తున్నావు మళ్లీ అంటుంది మాలిని. అనేది తెలియక చేసింది అనడంతో తెలియక చేస్తే కుంకుమ పదేపదే అక్కడ పెట్టుకోరు.
అందుకే ఆ కుంకుమను తన దగ్గరే పెట్టుకోమను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. అప్పుడు అరవింద్ మల్లీ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుని బాదపడుతూ ఉంటారు. మరొకవైపు వసుంధర ఇంటికి వెళ్లి జరిగిన విషయాలు తలచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అందుకోసం అంత కోపంగా ఉన్నావు అనడంతో కోపం కాదు తల పగల గొట్టాలని ఉంది. ఆ మళ్లీ తల పగలగొట్టాలని ఉంది అనడంతో శరత్ షాక్ అవుతాడు. అది చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు అనడంతో శరత్ నోటికొచ్చి ఎంత వస్తే అంత మాట అంటావా అనగా నీతో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా దాని వెనకేసుకొచ్చి ఇంత దూరం చేసుకోవచ్చారు అంటుంది.
అయినా ఆ అమ్మాయి చచ్చిపోవాలి అని కోరుకునే అంత సమస్య నీకు ఏముంది అని అడగడంతో సమస్య నాకు కాదు నా కూతురికి అంటుంది. అరవింద్ మాలిని ఇద్దరు మొదటి నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నారు వారి ప్రేమకు ఆ మల్లీ ని ఏదో ఒక విధంగా అడ్డు వస్తూనే ఉంది అని అంటుంది. వారిద్దరి మధ్యలో గొడవలు రావడానికి కారణం ఆ మల్లీని అందుకే అది చస్తే అన్న నా కూతురు హ్యాపీగా ఉంటుంది అన్న ఆశ అని అంటుంది. ఎప్పుడు ఏం జరిగింది అనడంతో వసుంధర రాత్రి జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు మల్లీ గురించి శరత్,వసుంధర ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు నా మాటల కోపంగా అనిపించినా రేపు ఆ మల్లీ వల్ల నీ కూతురు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి కూర్చుంటుంది ఆ రోజు ఏం చేస్తారో చూడండి అని అంటుంది. మరొకవైపు మాలిని అన్నం తినకుండా బాధపడుతూ కూర్చోగా ఇందులో మల్లీ వచ్చి అక్క అన్నం తిందురా అనగా ఆకలిగా లేదు అనొద్దు ఏం తిన్నావ్ అని ఆకలిగా లేదంటున్న అక్క చెప్పు అని అంటుంది. ఏం జరిగిందో నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలుసు కానీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావ్ మల్లీ అని అంటుంది. ఆ తర్వాత మాలిని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మల్లీ నేరుగా అరవింద్ దగ్గరికి వెళ్లి అక్క భోజనం చేయమంటే చేయలేదు అనగా నువ్వు తిన్నావా,నువ్వు తిన్నావా అని ఎవరైనా అడిగారా నీ గురించి నువ్వు చూసుకో నీకు వేరే వాళ్ళ గురించి అవసరం లేదు అని అంటాడు అరవింద్.
అప్పుడు అరవింద్ కూడా కోప్పడగా మల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మల్లీ అరవింద్,మాలిని ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు కూర్చొని జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత అరవింద్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మల్లీ వచ్చి బాబు గారు మీరు అక్క ఇదివరకటిలాగే ఉండాలి అనడంతో నేను అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నా మల్లీ కానీ నా వల్ల అవ్వడం లేదు అని అంటాడు అరవింద్. ఏం కాదు బాబు గారు సారీ చెప్పండి కావాలంటే ఎన్ని అడుగులైనా వెనక్కి తగ్గండి అంటుంది మల్లీ. ఇప్పటికే చాలా తగ్గాను మల్లీ అయినా నువ్వు ఆలోచిస్తున్నట్టుగా ఇంకొకరు ఆలోచించరు నీ స్థానంలో వేరే అమ్మాయి ఉంటే ఇలా ఆలోచించేది కాదు అంటాడు అరవింద్. అందుకే నేను మీకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటుంది మల్లీ. నువ్వు నాకు దూరంగా ఉన్న దగ్గరకు ఉన్న నేను మాత్రం మాలినికి ఇదివరకటి లాగా దగ్గర కాలేను మల్లీ అని అంటాడు అరవింద్. మనసులో మాలిని లేదు నా మనసులో నువ్వే ఉన్నావు అని అంటాడు అరవింద్.
