అరవింద సమేత వీర రాఘవ డైలాగ్స్ లీక్

Aravainda sametha veera raghava dialogues leak
Highlights

అన్నా మాది రాయలసీమ.. నమ్మితే ప్రాణాలు ఇస్తాం.. నమ్మకద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అర‌వింద స‌మేత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచే మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. పూజా హెగ్డే చిత్ర సెట్స్ లో పాల్గొనడం జరిగింది.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను పెట్టుకొని కొత్త లుక్ ట్రై చెయ్యడం జరిగింది. ఈ సినిమా పొలిటికల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలోని ఒక డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ”అన్నా మాది రాయలసీమ.. నమ్మితే ప్రాణాలు ఇస్తాం.. నమ్మకద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం”. ఈ డైలాగ్ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చెప్పబోతున్నట్లు సమాచారం. అందుకే అరవింద సమేత సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ వేశారట.

loader