ఓవైపు చెన్నై వరదలతో జనాలు అల్లకల్లోలం అవుతుంటూనే.. నెటిజన్లకు చిర్రెత్తిపోయేలా చేశారు ఏఆర్ రెహమాన్. పాపం ఆ సినిమాతో మొదటి నుంచీ వివాదాలు, విమర్శలనే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడేమైందంటే..
పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) ఈ మధ్య వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వరుస వివాదాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఆ మధ్యలో చెన్నైలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ తో వివాదంలో పడ్డారు. ఆ వెంటనే Pippa Movie కి అందిచిన సాంగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ట్యూన్ మార్చారంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు వివాదంలోకి లాగారు.
ప్రముఖ బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన స్వాతంత్ర్యోద్యమానికి సబంధించిన పాటను ‘పిప్పా’లో రెహమాన్ ట్యూన్ చేశారు. కరార్ ఓయ్ లౌహో కొపట్ ట్యూన్ మార్చేసారంటూ రెహ్మాన్ విమర్శలు తప్పలేదు. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాతోనే నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కుంటారు. ఓవైపు మిచౌంగ్ (Michaung Cyclone)తో చెన్నై ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే.. రెహమాన్ ఆ మూవీ పాటను విడుదల చేస్తూ ట్వీట్ చేశారు.
తాజాగా పిప్పా నుంచి Main Parwana అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేస్తూ.. ‘మే పర్వానా రిథమ్ ను ఎంజాయ్ చేయండి.. ఈ రిథమ్ కు డాన్స్ చేయడానికి మార్గదర్శం చేసుకోండి’ అంటూ పేర్కొన్నారు. ఇది చూసిన చెన్నై వాసులు, నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దేశవ్యాప్తంగా చెన్నై ఫ్లడ్స్ పై ఆందోళన వ్యక్తం అవుతుంటే.. రిథమ్ కు డాన్స్ చేయమంటారా? అంటూ ఏకి పారేస్తున్నారు.
అదేంటో గానీ ‘పిప్పా’ సినిమాతో ఏఆర్ రెహమాన్ చాలా వివాదాలు, విమర్శలను ఎదుర్కొవడం గమనార్హం. దీంతో ఈ సినిమా స్టార్ కంపోజర్ కు గుర్తుండిపోయేలా మెమోరీస్ ను ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక చెన్నైలో పరిస్థితి ఇంకా ఆందోళనకరణంగానే ఉంది. మిచౌంగ్ తుఫాన్ తో ప్రజలే కాదు.. సెలబ్రెటీలు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. అక్కడి ప్రభుత్వం నిరంతరాయంగా రక్షణ చర్యలను కొనసాగిస్తోంది.
