ఈ ప్రాజెక్టు కు మ్యూజిక్ డైరక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని ఎంచుకున్నారట. ఈ మేరకు ఆయన్ను కలవటం ,కథ వినిపించటం జరిగిందట. అయితే రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.
‘అంటే సుందరానికి’ లాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని ఇంకో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి #AnteSundaraniki సినిమా కమర్షియల్ గా సక్సెస్ వర్కవుట్ కాకయినా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకోవటం కలిసి వచ్చింది. నాని #Nani కెరీర్ లో ఓ మంచి సినిమాలా నిలిచింది. దాంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ #VivekAthreya ఈ సారి అన్ని జాగ్రత్తలతో నెక్ట్స్ ప్రాజెక్టు తెరకెక్కించబోతున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. పూర్తి సాఫ్ట్ సినిమా కాకుండా కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేసినట్లు చెప్పుకుంటున్నారు వివేక్ ఆత్రేయ. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు కు మ్యూజిక్ డైరక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని ఎంచుకున్నారట. ఈ మేరకు ఆయన్ను కలవటం ,కథ వినిపించటం జరిగిందట. అయితే రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్టు నిమిత్తం #ARRahman పది కోట్లు దాకా డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కావటంతో ఖచ్చితంగా ఆ రేటు ఇస్తేనే బెస్ట్ అని టీమ్ భావిస్తోందిట. కాస్త తక్కువ మొత్తానికి ఒప్పించేందుకు నిర్మాతలు బేరాలు చేస్తున్నారని వినిపిస్తోంది. నాని-వివేక్ మాత్రం ఎలాగైనా రెహ్మాన్ ను ప్రాజెక్టులోకి తీసుకు రావాలనే చూస్తున్నారట. నిర్మాత దానయ్య ఏం చెయ్యబోతున్నారో, రెహమాన్ ని ప్రాజెక్టులోకి తీసుకువస్తున్నారో లేదో చూడాలి.
ఇక ప్రస్తుతం శౌర్యువ్ తో నాని తన 30వ సినిమా చేస్తున్నారు. డిసెంబర్ లాస్ట్ వీక్ రిలీజ్ ప్లాన్ చేసుకుని మరీ తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ లో నాని, వివేక్ ఆత్రేయతో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఈ చిత్రం లో ఓ చిన్నారికి తండ్రిగా నాని కనిపించబోతున్నాపు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ లో సినిమా రాబోతుంది.
