ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ రెహమాన్.. ఆయన కూతురు పెళ్ళి చాలా సింపుల్ గా చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ రెహమాన్.. ఆయన కూతురు పెళ్ళి చాలా సింపుల్ గా చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ హిస్టరీలో ఏఆర్ రెహమాన్ ఓ ప్రత్యేక శఖం. ఇప్పటి వరకూ ఇండియ హిస్టరీలో ఎవరూ సాధించలేని విధంగా ఆస్కార్ ను సాధించి మన ఖ్యాతిని పెంచాడు రెహమాన్. రాను రాను ఆయన ప్రభావం తగ్గిపోయింది. శంకర్ లాంటి కొంత మంది డైరెక్టర్లకు మాత్రమే మ్యూజిక్ చేస్తున్నాడు. 

ఇక ఇఫ్పుడు తన వారసులను ప్రమోట్ చేసే పని స్టార్ట్ చేశాడు ఏఆర్ రెహమాన్. అందులో భాగంగానే తన కొడుకు, కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రెహమాన్. రెహమాన్ పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ఇప్పటికే సింగర్ గా అందరికి పరిచయమైన రెహమాన్ కొడుకు ఏఆర్ అమిన్ ను రీసెంట్ గా గ్రామీ అవార్డ్స్ పంక్షన్ కు స్వయంగా వెంటబెట్టుకుని వెళ్ళాడు రెహమాన్.

ఇక తన కూతురు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇక రీసెంట్ గా ప్రముఖ లైవ్ సౌండ్ ఇంజనీర్ రియాస్ దీన్ షేక్ మొహ‌మ్మ‌ద్ తో ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్‌ పెళ్ళిసింపుల్ గా జరిగింది.వీరిద్దరి నిశ్చితార్థం గ‌త ఏడాది డిసెంబరు 29న ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే. రియాస్, ఖ‌తీజాల వివాహం తాజాగా సింపుల్‌గా జ‌రిగింది. 

Scroll to load tweet…

అయితే తన పెళ్లి ఫొటోలను ఖతీజా సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేసుకుంది. జీవితంలో ఇది ఎంతో సంతోష‌క‌రమైన‌ రోజ‌ని, త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ట్లు ఖ‌తీజా త‌న ఇన్ స్టాగ్రామ్‌ పోస్టులో రాసింది. ఏఆర్ రెహ‌మాన్ కూడా ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ జంట‌ను భ‌గ‌వంతుడు దీవించాల‌ని కోరుకున్నాడు.