లాక్‌ డౌన్‌ కాలంలో దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే రామ్‌ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఓటీటీ వేదికగా క్లైమాక్స్‌, నేక్డ్‌ సినిమాలను రిలీజ్ చేసిన వర్మ వరుసగా సినిమాలు ప్రకటించేస్తున్నాడు. తాజాగా థ్రిల్లర్ పేరుతో మరో హాట్ మూవీని ప్రకటించాడు వర్మ. ఈ సినిమాతో అప్సరా రాణి అనే బ్యూటీని పరిచయం చేస్తున్నట్టుగా వెల్లడించాడు.

అంతేకాదు వరుసగా అప్సర ఫోటోలోను ట్వీట్ చేస్తూ హల్‌చల్ చేస్తున్న వర్మ. అంతేకాదు ఇప్పటికే థ్రిల్లర్‌ షూటింగ్‌ను ప్రారంభించిన వర్మ షూటింగ్ లొకేషన్‌ నుంచి కూడా ఫోటోలను రిలీజ్ చేస్తున్నాడు. అప్సర ఒడిషాకు చెందిన బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యింది. అప్పర గతంలోనూ రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె అసలు పేరు అంకితా మహారాణా. ఆమె పేరును వర్మే అప్పరా రాణిగా మార్చాడు.

తాజాగా అప్పర రాణి  పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఓపెన్ చేసిన అప్సర భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది.  ఇక వర్మ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాకు సంబంధించి ఒక్క అప్పర గురించి తప్ప ఇతర విషయాలేవి వెల్లడించలేదు వర్మ. కేవలం అప్సర అందాల నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.